టీఎస్‌–ఐపాస్‌ దరఖాస్తులు పరిష్కరించాలి | solve the tspass applications | Sakshi
Sakshi News home page

టీఎస్‌–ఐపాస్‌ దరఖాస్తులు పరిష్కరించాలి

Jul 30 2016 10:45 PM | Updated on Mar 21 2019 8:35 PM

టీఎస్‌–ఐపాస్‌ దరఖాస్తులు పరిష్కరించాలి - Sakshi

టీఎస్‌–ఐపాస్‌ దరఖాస్తులు పరిష్కరించాలి

టీఎస్‌–ఐపాస్‌ కింద పరిశ్రమల ఏర్పాటు కోసం చేసుకున్న దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ టీకే శ్రీదేవి సూచించారు. శనివారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో టీఎస్‌–ఐపాస్‌పై అధికారులతో సమీక్షించారు.

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌: టీఎస్‌–ఐపాస్‌ కింద పరిశ్రమల ఏర్పాటు కోసం చేసుకున్న దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ టీకే శ్రీదేవి సూచించారు. శనివారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో టీఎస్‌–ఐపాస్‌పై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 12ప్రభుత్వ శాఖల అనుమతులు మంజూరులో జాప్యం చేయొద్దన్నారు. ఎలక్ట్రిసిటీ, గ్రౌండ్‌వాటర్, గ్రామ పంచాయతీ అనుమతులు ఇవ్వడంలో ఆలస్యం చేయొద్దని సూచించారు. టీప్రై డ్‌ కార్యక్రమంలో ఔత్సాహికులను పారిశ్రామిక రంగం వైపు ప్రోత్సహించాలన్నారు. టీప్రై డ్‌ ద్వారా ట్రాక్టర్లు, కార్లు మాత్రమే తీసుకుంటున్నార ని, ఉత్పాదకరంగం వైపు మొగ్గు చూపే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో డీఆర్వో భాస్కర్, పరిశ్రమల జీఎం రవీందర్, ఎల్‌డీఎం పార్థసారథి, గ్రౌండ్‌ వాటర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement