వివిధ రంగాల్లో నిష్ణాతులైన యువజనులు, వ్యక్తులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పద్మ అవార్డు పురస్కారం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం.జగన్‌మోహన్, స్టెప్ సీఈవో వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
‘పద్మ’ అవార్డు కోసం దరఖాస్తుల ఆహ్వానం
Jul 21 2016 11:16 PM | Updated on Mar 21 2019 8:35 PM
ఆదిలాబాద్: వివిధ రంగాల్లో నిష్ణాతులైన యువజనులు, వ్యక్తులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పద్మ అవార్డు పురస్కారం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం.జగన్‌మోహన్, స్టెప్ సీఈవో వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లాకు చెందిన యువజనులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. కలలు, సామాజిక పనులు, ప్రజావ్యవహారాలు, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, వ్యాపార, పరిశ్రమ, మెడిసిన్ (వైద్యం), సాహిత్యం, విద్య, సివిల్ సర్వీస్, స్పోర్ట్స్, ఇతర అంశాల్లో నిపుణులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ మూడు రకాల అవార్డులు ఉంటాయని తెలిపారు. పై అవార్డులను జాతీయ స్థాయిలో ఎంపికైన వారికి వచ్చే గణతంత్ర దినోత్సవ 2017 వేడుకల్లో ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలోని యువజన సర్వీసుల శాఖ, స్టెప్ కార్యాలయంలో దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. నేరుగా ఆన్‌లైన్‌లో ఠీఠీఠీ.p్చఛీఝ్చ్చఠ్చీటఛీట.జౌఠి.జీn ద్వారా పత్రాలను డౌన్‌లోడ్ చేసుకొని, పూర్తి చేసిన దరఖాస్తులను ఈనెల 31లోగా స్టెప్ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుందని తెలిపారు. రెండు పేజీలు మించకుండా వివరాలు రాసి దరఖాస్తుతో జత చేయాలని పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం 08732–226441, సెల్: 9515460477, 8184995234లపై సంప్రదించాలని తెలిపారు.
Advertisement
Advertisement