నేటి నుంచి శివలింగ మహిమపై ప్రవచనాలు | shivalinga mahima pravachans from today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి శివలింగ మహిమపై ప్రవచనాలు

Dec 20 2016 11:48 PM | Updated on Sep 27 2018 5:46 PM

శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల సన్నిధిలో శివలింగమహిమలపై ప్రవచనాలను ప్రముఖ ప్రవచన కర్త బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్‌ వినిపిస్తారని జేఈఓ హరినాథ్‌రెడ్డి మంగళవారం తెలిపారు.

శ్రీశైలం: శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల సన్నిధిలో శివలింగమహిమలపై ప్రవచనాలను ప్రముఖ ప్రవచన కర్త బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్‌ వినిపిస్తారని జేఈఓ హరినాథ్‌రెడ్డి మంగళవారం తెలిపారు. అక్కమహాదేవి అలంకార మండపంలో 21 నుంచి 25 వరకు ప్రతిరోజు సాయంత్రం జరిగే ప్రవచనాలలో శివలింగ ఆవిర్భావం, శివలింగ మహిమ, శివలింగ ఆరాధనతో కలిగే లాభాలు, శివలింగార్చన విశేషాలపై ప్రవచనాలు వినిపిస్తారన్నారు. ధనుర్మాసం శివుడికి చాలా ప్రీతికరమని, ఈ మాసంలో శివసంబంధమైన వివేషాలను తెలుసుకోవడం చాలా అవసరమన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement