కాళింగ సామాజిక వర్గానికి నష్టం జరగకుండా రాజకీయాలకు అతీ తంగా శ్రమించాలని కళింగసీమ సేవాసమితి అభిప్రాయపడింది.
- ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు నిర్ణయం
- రాజకీయాలకు అతీతంగా ఉద్యమానికి తీర్మానం
శ్రీకాకుళం టౌన్
కాళింగ సామాజిక వర్గానికి నష్టం జరగకుండా రాజకీయాలకు అతీ తంగా శ్రమించాలని కళింగసీమ సేవాసమితి అభిప్రాయపడింది. ఆదివారం శ్రీకాకుళం నగరంలోని శాంతినగర్ కాలనీలో ఉన్న కళిం గభవన్‌లో సేవాసమితి అధ్యక్షులు హనుమంతు కష్ణారావు అద్యక్షతన జరిగిన సమావేశంలో వక్తలు మాట్లాడారు. సమావేశానికి హాజరైన ప్రభుత్వ విప్ కూన రవికుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న పల్స్ సర్వేలో ఉపకులాల ఆప్షన్ తొలగించడానికి ముఖ్యమంత్రితో మాట్లాడతానన్నారు.
ఈ ఆప్షన్ తొలగించేంత వరకు పల్స్ సర్వే నిలుపుదల చేయడానికి ఒత్తిడి తీసుకువస్తామని చెప్పారు. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కపారాణి మాట్లాడుతూ ప్రభుత్వంలో ఉన్న కా ళింగ సామాజిక వర్గ నేతలు ఈ విషయంలో చొరవ చూపాలని కోరారు.
ఉప కులాల ప్రస్తావన అన్యాయం...
కార్యక్రమంలో మాజీ మంత్రి తమ్మినేని సీతారాం మాట్లాడుతూ పల్స్ సర్వేలో కాళిం గ సామాజిక వర్గం ఉపకులాలను ప్రస్తావించడం అన్యాయమన్నారు. సర్వేలో కాళిం గ సామాజిక వర్గంగానే నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం సామాజిక వర్గాన్ని పణంగా పెట్టడం సరికాదన్నారు. సర్వే సమయంలో గ్రామాల వారీగా సామాజిక వర్గాన్ని చైతన్యపరచి ఉపకులాలు లేకుండా కాళింగ కులంగానే న మోదు చేయించాలని సూచించారు.
ఆప్షన్ తొలగించాలంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఒత్తిడిపెంచేందుకు ఉద్యమించాలని కోరా రు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు బొడ్డేపల్లి సత్యవతి, పిరియాసాయిరాజ్, రిటైర్డు జడ్జి పప్పల జగన్నాథం, డా. బిఆర్ అంభేద్కర్ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గుంట తులసీరావు, జిల్లా ఎన్జీఓల సంఘం అద్యక్షులు హనుమంతు సాయిరాం, కళింగసేవాసమితి అధ్యక్ష, కార్యదర్శులు హనుమంతు కష్ణారావు, చింతాడ రామ్మోహనరావు, ఉపాధ్యక్షులు మార్పు ధర్మారావు, దువ్వాడ శ్రీనివాస్, వాణి, కింతలి కరుణాకరరావు, సీపాన వెంకటరమణ, పూడితిరుపతిరావు, ప్రధాన ఆదినారాయణ, బార్ అసోషియేషన్ మాజీ అధ్యక్షులు పొన్నాడ వెంకటరమణ, చింతాడ గణపతిరావు, డా.పైడి మహేశ్వరరావు, సనపల నారాయణరావు, డా. దానేటి శ్రీధర్, పిజెనాయుడు, బలగ మురళి, దుప్పల రవీంద్రబాబు, పేడాడ తిలక్, జల్లు వెంకటరమణ, డాక్టర్ ప్రదాన శివాజీ, కేవీవీ సత్య నారాయణ తదితరులు మాట్లాడారు.
అనంతరం సమావేశంలో ఏడు తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదం తెలిపారు. ప్రదానంగా పల్స్ సర్వేలో కాళింగ సామాజిక వర్గం తప్ప కింతి, బూరగాన, బూరగాం, పందిరి అనే ఉపకులాలు లేకుండా సర్వే జరపాలని, కాళింగ ప్రతినిధులను ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లి సమస్యకు ముగింపు పలకాలని, రాజకీయ, సామాజిక నామినేటెడ్ పదవులను కాళింగ సామాజిక వర్గానికి కేటాయించాలని తీర్మానించారు. అలాగే కాళింగ కార్పోరేషన్ ఏర్పాటు చేసి ఆర్థిక, సాంకేతిక సహకారం అందించాలని, కాళింగ కులాన్ని బీసీ ఎ జాబితానుంచి డినోటిఫైడ్ ట్రైబుల్‌గా గుర్తించాలని, రాష్ట్ర రా జధాని అమరావతిలో కళింగ సామాజిక వ ర్గానికి భవన నిర్మాణానికి అవసరమైన భూమిని కేటాయించాలని తీర్మానం చేశారు.