సందేశ్ అంత్యక్రియలు పూర్తి | Sandesh complete funeral | Sakshi
Sakshi News home page

సందేశ్ అంత్యక్రియలు పూర్తి

Oct 20 2015 3:13 AM | Updated on Nov 9 2018 4:59 PM

సందేశ్ అంత్యక్రియలు పూర్తి - Sakshi

సందేశ్ అంత్యక్రియలు పూర్తి

నోయిడాలో తోటి విద్యార్థుల కాల్పుల్లో మృతి చెందిన విద్యార్థి సందేశ్ అంత్యక్రియలు సోమవారం హైదరాబాద్

 హైదరాబాద్: నోయిడాలో తోటి విద్యార్థుల కాల్పుల్లో మృతి చెందిన విద్యార్థి సందేశ్ అంత్యక్రియలు సోమవారం హైదరాబాద్ మన్సూరాబాద్‌లోని పెద్ద చెరువు వద్ద నిర్వహించారు. నల్లగొండ జిల్లాకు చెందిన శ్యాంసుం దర్‌రావు, రూపల చిన్న కుమారుడు సందేశ్ ఉత్తరప్రదేశ్‌లోని అమిటి విశ్వవిద్యాలయంలో బీఎస్సీ(మెరైన్ సైన్స్) 2వ సంవత్సరం చదువుతున్నాడు. స్నేహితులతో వివాదాల నేపథ్యంలో రెండ్రోజుల క్రితం సందేశ్ హత్యకు గురయ్యాడు. అంత్యక్రియల నిమిత్తం సందేశ్ మృతదేహాన్ని నాగోలు చాణక్యపురిలో నివాసముంటున్న అతని బాబాయ్ రవి చందర్ ఇంటికి తెచ్చారు. అనంతరం మన్సూరాబాద్ పెద్ద చెరువు వద్ద దహన సంస్కారాలు నిర్వహించారు.

మృతదేహాన్ని చూసిన అన్న సంతోష్‌తో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. అధికారులు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో మాట్లాడి హత్యపై విచారణ జరిపించాలని సందేశ్ తండ్రి శ్యాంసుందర్‌రావు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement