ప్రభుత్వం ప్రకటించిన ఉచిత ఇసుక విధానానికి లోబడి మూడు రీచుల్లో ఇసుక తవ్వకాలు చేసుకోవచ్చని కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
శ్రీకాకుళం: ప్రభుత్వం ప్రకటించిన ఉచిత ఇసుక విధానానికి లోబడి మూడు రీచుల్లో ఇసుక తవ్వకాలు చేసుకోవచ్చని కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. నరసన్నపేట మండలం గోపాలపెంటలో 32,000 క్యూబిక్ మీటర్లు, పోతయ్యవలసలో 40,000 క్యూబిక్ మీటర్లు ఇసుకను ప్రజలు తవ్వుకోవచ్చని తెలిపారు.
అలాగే అదే మండలానికి చెందిన మడపాంలో 50,000 క్యూబిక్ మీటర్ల రీచ్‌ను విశాఖపట్నం అవసరాల కోసం కేటాయించినట్లు తెలిపారు. అదేవిధంగా జిల్లా ఇసుక కమిటీ ఆదేశం ప్రకా రం దొంపాక రీచ్ జలుమూరు మండలంలో అనుమతించిన ఇసు క పరిమాణం 24,000 క్యూబిక్ మీటర్లు పూర్తిగా తవ్వడం వల్ల రీచ్‌ను ఆపివేశామని ఆ ప్రకటనలో తెలిపారు.