సాక్షి ఎరెనా వన్‌ స్కూల్‌ ఫెస్ట్‌ | sakshi arena one school fest | Sakshi
Sakshi News home page

సాక్షి ఎరెనా వన్‌ స్కూల్‌ ఫెస్ట్‌

Aug 24 2016 12:53 AM | Updated on Aug 20 2018 8:20 PM

ప్రతి విద్యార్థిలో ఏదో ఒక ప్రతిభ ఉండే ఉంటుంది..

ప్రతి విద్యార్థిలో ఏదో ఒక ప్రతిభ ఉండే ఉంటుంది.. అది తల్లిదండ్రులకు తెలియకపో వచ్చు.. లేదా గుర్తించకపోవచ్చు... గుర్తించి నా.. సరైన వేదిక లేక మిన్నకుండిపోవచ్చు.. ఇకపై ఆ అవసరం లేదు.. మీ పిల్లల్లోని టాలెంట్‌ను తెలుసుకునే అవకాశం వచ్చింది. మీ పిల్లల ప్రతిభను అందరికి తెలిసేలా

‘సాక్షి’ వేదికను సిద్ధం చేసింది.
త్వరలోనే ‘సాక్షి ఎరెనా వన్‌ స్కూల్‌ ఫెస్ట్‌’ పోటీలను నిర్వహించబోతోంది. పిల్లలను పోటీలో పాల్గొనేలా ప్రోత్సహించండి చాలు.. వారి టాలెంట్‌ను బహిర్గతం అవుతుంది.. అందరితో శభాష్‌ అనిపించుకుంటారు.. మిగతా పిల్లలకు ఆదర్శంగా నిలుస్తారు.

పోటీలకు సిద్ధం కండి...
ఇప్పటివరకు సాక్షి ఇండియా స్పెల్‌–బి, మ్యాథ్‌ బి నిర్వహించిన సంగతి మీకు తెలిసిందే కదా.. ఇపుడు వాటితోపాటు ఆట, పాటలు, çసృజనాత్మకత వంటి రంగాల్లో పోటీలు నిర్వహిస్తోంది. ఇందుకు కొద్దిపాటి ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేయించుకోండి.
 కొన్ని పోటీలు ఇండివుడ్యువల్‌గా.. మరి కొన్ని గ్రూపు/టీమ్‌ విభాగాల్లో ఉంటాయి. ఇంకొన్నింటికి వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకునే వీలుంటే.. మరికొన్నింటికి పాఠశాల ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి.

ఏయే అంశాల్లో పోటీలు..
1. క్రియేటివ్‌ ఎరెనా: పోస్టర్‌ మేకింగ్, ప్రజెంటేషన్, 2. లిటరరీ: ఆర్టికల్‌ రైటింగ్, డిబేట్, క్విజ్, హ్యాండ్‌ రైటింగ్‌. 3.ఫైన్‌ ఆర్ట్స్‌: పెయింటింగ్, ఫొటోగ్రఫీ. 4. ఫర్‌ఫార్మింగ్‌ ఆర్ట్స్‌: డాన్స్‌ (సోలో/గ్రూపు), ఇన్‌స్ట్రుమెంట్‌ సోలో, సింగింగ్‌. 5. స్పోర్ట్స్‌: క్రికెట్‌–టీమ్, క్యారమ్స్‌ (సింగిల్‌/డబుల్స్‌), చెస్, బాడ్మిం టన్‌ (సింగిల్‌/డబుల్‌), బాస్కెట్‌ బాల్‌– టీమ్, టేబుల్‌ టెన్నిస్‌ (సింగిల్‌/డబుల్‌).
మూడు దశల్లో పోటీలు..
మొదటి రౌండ్‌ పోటీలు: పాఠశాల స్థాయిలో ఉంటాయి. పాఠశాల యాజమాన్యం ఆధ్వ ర్యంలో ఇంటర్నల్‌ పోటీలు నిర్వహించాలి. అందులో విజేతలుగా నిలిచిన విద్యార్థులు, టీమ్‌లను ఎంపిక చేసి పంపించాలి.
రెండో రౌండ్‌: జిల్లాస్థాయిలో.. సాక్షి టీమ్‌ ఆధ్వర్యంలో జిల్లాల్లో పోటీలు నిర్వహిస్తారు.
చివరి రౌండ్‌: రాష్ట్ర స్థాయిలో ఉంటాయి. ఈ పోటీలను ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో, తెలంగాణలోని హైదరాబాద్‌లో నిర్వహిస్తాం.
 క్రియేటివ్‌ ఎరెనా, ఫైన్‌ ఆర్ట్స్, లిటరరీ, ఫర్‌ఫార్మింగ్‌ ఆర్ట్స్, స్పోర్ట్స్‌పోటీలను 7 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు నిర్వహిస్తారు. కింది తరగతి విద్యార్థులకు ఆసక్తి ఉన్నా పోటీల్లో పాల్గొనవచ్చు.
 ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన పిల్లలకు ఛాంపియన్‌ స్కూల్‌ ట్రోపీ ఉంటుంది.
6. సాక్షి ఇండియా స్పెల్‌ బి, మ్యాథ్‌ బి:
 ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు స్పెల్‌ బి, మ్యాథ్‌ బిని నాలుగు కేటగిరీలుగా నిర్వహిస్తాం. ఇందులో మొదటి విజేతకు గోల్డ్‌ మెడల్, రూ. 15 వేల నగదు, ద్వితీయ విజేతకు రజత పతకం, రూ. 10 వేల నగదు, తృతీయ విజేతకు కాంస్య పతకం, రూ. 5 వేల నగదు బహుమతి అందజేస్తారు.
రిజిస్ట్రేషన్, మరిన్ని వివరాల కోసం..
ఠీఠీఠీ.్చట్ఛn్చౌn్ఛటఛిజిౌౌlజ్ఛట్ట.ఛిౌఝ వెబ్‌సైట్‌లో సంప్రదించవచ్చు.
 తెలంగాణ, ఏపీలోని అన్ని ప్రాంతాల వారు సాక్షి ఇండియా స్పెల్‌ బీ కోసం ఆగస్టు 31వ తేదీ వరకు  రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు, సాక్షి మ్యాథ్‌ బి కోసం సెప్టెంబర్‌ 5 వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. వీటికి విద్యార్థులు వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
 ఇతర పోటీలకు సెప్టెంబరు 24లోగా సంబంధిత పాఠశాల ద్వారానే రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. వ్యక్తిగత దరఖాస్తులను అనుమతించరు.

రిజిస్ట్రేషన్‌ ఫీజు వివరాలు..
 సాక్షి ఇండియా స్పెల్‌బీ, సాక్షి మ్యాథ్‌ బీ ఫీజు రూ. 250
 పోస్టర్‌ మేకింగ్, ప్రజెంటేషన్, పెయిం టింగ్, ఫొటోగ్రఫీ, ఆర్టికల్‌ రైటింగ్, డిబేట్, హ్యాండ్‌ రైటింగ్, సింగింగ్, క్యారమ్స్‌ సింగి ల్, చెస్, బ్యాడ్మింటన్‌ సింగిల్, టేబుల్‌ టెన్నిస్‌ (సింగిల్‌) పోటీలకు రూ.50.
క్విజ్, డ్యాన్స్‌సోలో, ఇన్‌స్ట్రుమెంట్‌ సో లో, క్యారమ్స్‌ డబుల్, బ్యాడ్మింటన్‌ డబుల్, టేబుల్‌ టెన్నిస్‌ డబుల్‌ పోటీలకు రూ. 100.
 డాన్స్‌ – గ్రూపు, బాస్కెట్‌ బాల్‌ – టీమ్‌ పోటీలకు రూ.300 చొప్పున ఫీజు.
 క్రికెట్‌ (టీమ్‌) పోటీకి రూ. 500 రిజిస్ట్రేషన్‌ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.

సాక్షి ప్రాంతీయ కార్యాలయం
ప్లాట్‌ నంబర్‌ 103, 104
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు పైన
ఎస్‌ఎస్‌ టవర్స్, రాజురోడ్డు, అనంతపురం. ఫోన్‌: 9849067681

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement