ఆర్టీసీ ఆన్‌లైన్‌ సేవల బుక్‌లెట్‌ విడుదల | rtc online service book let open | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ ఆన్‌లైన్‌ సేవల బుక్‌లెట్‌ విడుదల

Aug 1 2016 11:46 PM | Updated on Sep 4 2017 7:22 AM

ప్రయాణికులకు ఆర్టీసీ ఆన్‌లైన్‌ సేవలపై పట్ల అవగాహన కల్పిచేందుకు కరీంనగర్‌ ఈడీ జి. సత్యనారాయణ బుక్‌లెట్‌ విడుదల చేశారు. ఆన్‌లైన్‌ సేవలు ఎలా పొందాలో తెలియజేస్తూ రూపొందించిన వీడియో విజువల్స్‌ను ఈడీ కార్యాలయంలో సోమవారం ఆవిష్కరించారు.

మంకమ్మతోట: ప్రయాణికులకు ఆర్టీసీ ఆన్‌లైన్‌ సేవలపై పట్ల అవగాహన కల్పిచేందుకు కరీంనగర్‌ ఈడీ జి. సత్యనారాయణ బుక్‌లెట్‌ విడుదల చేశారు. ఆన్‌లైన్‌ సేవలు ఎలా పొందాలో తెలియజేస్తూ రూపొందించిన వీడియో విజువల్స్‌ను ఈడీ కార్యాలయంలో సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆన్‌లైన్‌ ద్వారా రిజర్వేషన్‌ చేసుకునే సదుపాయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆన్‌లైన్‌ సేవల గురించి తెలియచేయడానికి నగరాలు, పట్టణాలతోపాటు అన్ని గ్రామీణ ప్రాంతాల్లో శిబిరాలు ఏర్పాటుచేసి అవగాహన కల్పిస్తామని చెప్పారు. ప్రజలు రిజర్వేషన్‌ పొందేందుకు  ప్రస్తుతం జోనల్‌లో 25 లక్షల 85వేల సీట్లు అందుబాటులో ఉంచామన్నారు. ప్రయాణికుల అవసరాలకు తగినట్లుగా కొత్త సర్వీసులు ఏర్పాటుచేసి సీట్లు పెంచుతామని వివరించారు. ప్రజలు ఆన్‌లైన్‌ ద్వారా విరివిగా ఆర్టీసీ సేవలు పొందాలని సూచించారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు అన్ని విధాలుగా కృషిచేస్తోందని చెప్పారు.  అందరికీ అర్థమయ్యే విధంగా  రూపొందించామని తెలిపారు. కార్యక్రమంలో రీజినల్‌ మేనేజర్‌ చంద్రశేఖర్, కరీంనగర్‌–2 డిపో మేనేజర్‌ లక్ష్మీధర్మ, అధికారులు జగదీశ్వర్‌ పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement