భోజనశాల నిర్మాణానికి రూ.20 లక్షల విరాళం | Rs 20 Lakh donation to dining hall bulding | Sakshi
Sakshi News home page

భోజనశాల నిర్మాణానికి రూ.20 లక్షల విరాళం

Aug 11 2016 7:55 PM | Updated on May 25 2018 7:04 PM

గ్రామీణ ప్రాంత పాఠశాలలు అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో మండల పరిధిలోని నరుకుళ్లపాడుకు చెందిన ప్రవాసాంధ్రుడు, పాఠశాల పూర్వ విద్యార్థి తుమ్మల సురేష్‌ శ్రీరామకృష్ణ హిందూ హైస్కూల్లో విద్యార్థుల భోజనశాల నిర్మాణానికి రూ.20 లక్షల విరాళాన్ని అందజేశారు.

అమరావతి : గ్రామీణ ప్రాంత పాఠశాలలు అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో మండల పరిధిలోని నరుకుళ్లపాడుకు చెందిన ప్రవాసాంధ్రుడు, పాఠశాల పూర్వ విద్యార్థి తుమ్మల సురేష్‌  శ్రీరామకృష్ణ హిందూ హైస్కూల్లో విద్యార్థుల భోజనశాల నిర్మాణానికి రూ.20 లక్షల విరాళాన్ని అందజేశారు. బుధవారం భోజనశాల నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమరావతి పరిసర ప్రాంతాల పేద విద్యార్థులకు 70 సంవత్సరాలుగా ఉత్తమ విద్యను అందిస్తుందన్న శ్రీరామకృష్ణ హిందూ హైస్కూల్‌లో తామంతా చదువుకున్నామని తెలిపారు. తుమ్మల సురేష్‌ పాఠశాల అభివృద్ధి రూ.20 లక్షల చెక్కులను పాఠశాల కరస్పాండెంట్‌ మల్లెల శ్రీనాథ్‌చౌదరికి అందించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement