రాయలసీమ వాదాన్ని చట్టసభల్లో వినిపించే నాయకుడికే మద్దతు ఉంటుందని రాయలసీమ సోషల్ మీడియా ఫోరం ప్రకటించింది.
అనంతపురం సప్తగిరి సర్కిల్ : రాయలసీమ వాదాన్ని చట్టసభల్లో వినిపించే నాయకుడికే మద్దతు ఉంటుందని రాయలసీమ సోషల్ మీడియా ఫోరం ప్రకటించింది. శనివారం స్థానిక వీకే భవన్‌లో చర్చావేదికను నిర్వహించారు. కార్యక్రమానికి రాయలసీమ సోషల్ మీడియా ఫోరం జిల్లా అధ్యక్షుడు అశోక్‌వర్ధన్‌రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రాయలసీమ విమోచన సమితి అధ్యక్షుడు రమణారెడ్డి మాట్లాడుతూ సీమ ప్రాంతంలో ఉన్న 52 మంది ఎమ్మెల్యేలు ఈ ప్రాంత సమస్యలపై వాదాన్ని వినిపించడంలో విఫలమయ్యారన్నారు. ఈ ప్రాంతానికి రావాల్సిన వసతులను తీసుకురావడంలో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు.
టీఎన్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నాగార్జునరెడ్డి మాట్లాడుతూ సీమకు జరుగుతున్న అన్యాయంపై చట్టసభల్లో మాట్లాడడానికి ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక మంచి అవకాశమన్నారు. రాయలసీమ ఉద్యమకారులు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. అమరావతిని ఫ్రీజోన్‌గా ప్రకటించకకుండా చంద్రబాబు తప్పిదం చేస్తున్నారన్నారు. రాయలసీమ విమోచన పోరాట సమితి నాయకులు రవి మాట్లాడుతూ నీరు, నిధుల కేటాయింపులో సీమకు అన్యాయం జరుగుతుందన్నారు.
రాయలసీమ విద్యార్థి సమాఖ్య అధ్యక్షుడు సీమకష్ణ మాట్లాడుతూ హైకోర్టు, రాజధాని విషయంలో సీమ ప్రాంతానికి తీవ్ర నష్టం జరిగిందన్నారు. రైల్వే జోన్ కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. రాజారెడ్డి మాట్లాడుతూ రాజకీయాలను పక్కనబెట్టి సీమ∙అభివద్ధికి రాజకీయ నాయకులు పాటుపడాలన్నారు. కార్యక్రమంలో సాహితీవేత్తలు సింగమనేని నారాయణ, బండి నారాయణస్వామి, అప్పిరెడ్డి హరినాథ్‌రెడ్డి, వత్సల, విరసం అరుణ్‌శర్మ, రాయలసేన అధ్యక్షుడు రాధాకష్ణారావు తదితరులు పాల్గొన్నారు.