ప్రధానమంత్రి బీమాయోజన చెక్కు అందజేత | primminester insurence chek | Sakshi
Sakshi News home page

ప్రధానమంత్రి బీమాయోజన చెక్కు అందజేత

Jul 21 2016 6:30 PM | Updated on Sep 4 2017 5:41 AM

మల్యాల: మల్యాల మండలంలోని మ్యాడంపల్లికి చెందిన అల్లె మల్లయ్య ప్రమాద వశాత్తు మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ మేనేజర్‌ రాజేంద్రప్రసాద్, ఎంపీడీవో శ్రీనివాస్‌మూర్తి, తహపీల్దార్‌ శ్రీహరిరెడ్డి రూ. 2లక్షల చెక్కును అందజేశారు. మల్లయ్య తెలంగాణ గ్రామీణ బ్యాంకులో పంట రుణం తీసుకున్నాడు.

మల్యాల:  మల్యాల మండలంలోని మ్యాడంపల్లికి చెందిన అల్లె మల్లయ్య ప్రమాద వశాత్తు మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ మేనేజర్‌ రాజేంద్రప్రసాద్, ఎంపీడీవో శ్రీనివాస్‌మూర్తి, తహపీల్దార్‌ శ్రీహరిరెడ్డి రూ. 2లక్షల చెక్కును అందజేశారు. మల్లయ్య తెలంగాణ గ్రామీణ బ్యాంకులో పంట రుణం తీసుకున్నాడు.  ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం కింద రూ. 12 బీమా చెల్లించాడు. ఈ ఏడాది జనవరిలో మల్లయ్య రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా, బీమా మొత్తం రూ. 2లక్షల అందజేశారు.
ఈ సందర్భంగా బ్యాంక్‌ మేనేజర్‌ రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ ఖాతాదారులు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద రూ. 12 వందలు  ప్రధానమంత్రి జీవనజ్యోతి పథకం కింద రూ. 330 చెల్లించాలని అన్నారు. బీమాతో ఖాతాదారుడి కుటుంబానికి లబ్ధి చేకూరుతుందని, ఖాతాదారులందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్‌మూర్తి, తహసీల్దార్‌ శ్రీహరిరెడ్డి, తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్‌ రాజేంద్రప్రసాద్, సీహెచ్‌.గోపాల్‌ పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement