ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం పోలవరం ప్రాజెక్టు పనులు పరిశీలించేందుకు వస్తున్న దష్ట్యా పనులు ఊపందుకున్నాయి. గత 10 రోజులుగా ఏదో ఒక సాకుతో పనులు నామమాత్రంగా జరిగాయి. ట్రాన్స్‌ట్రాయ్ కార్మికులకు జీతాలు చెల్లించకపోవడం, త్రివేణీ ఏజెన్సీకి డీజిల్ కొరతకావడం, దసరా పండుగ సందర్భంగా కార్మికులకు సెలవులు ప్రకటించడం వంటి కారణాలతో పనులు నత్తనడకన సాగాయి.
చురుగ్గా పోలవరం పనులు
Oct 16 2016 7:14 PM | Updated on Jul 28 2018 6:35 PM
పోలవరం రూరల్ః
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం పోలవరం ప్రాజెక్టు పనులు పరిశీలించేందుకు వస్తున్న దష్ట్యా పనులు ఊపందుకున్నాయి. గత 10 రోజులుగా ఏదో ఒక సాకుతో పనులు నామమాత్రంగా జరిగాయి. ట్రాన్స్‌ట్రాయ్ కార్మికులకు జీతాలు చెల్లించకపోవడం, త్రివేణీ ఏజెన్సీకి డీజిల్ కొరతకావడం, దసరా పండుగ సందర్భంగా కార్మికులకు సెలవులు ప్రకటించడం వంటి కారణాలతో పనులు నత్తనడకన సాగాయి. తిరిగి శనివారం నుంచి ఏజెన్సీ ప్రతినిధులు అధికసంఖ్యలో వాహనాలు ఏర్పాటు చేసి పనులు చేపట్టారు. స్పిల్‌వే నిర్మాణ ప్రాంతంలో నిలిచిన వర్షం నీటిని కూడా ఇంజిన్‌లు ఏర్పాటు చేసి బయటకు తోడుతున్నారు.
Advertisement
Advertisement