ర్యాలీలకు అనుమతి అవసరం | permits must for rally | Sakshi
Sakshi News home page

ర్యాలీలకు అనుమతి అవసరం

Feb 16 2017 10:59 PM | Updated on Oct 4 2018 5:44 PM

పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ర్యాలీలు, వాహనాలకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని అనంతపురం డీఆర్‌ఓ మల్లీశ్వరిదేవి తెలిపారు.

అనంతపురం అర్బన్‌ : పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ర్యాలీలు, వాహనాలకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని అనంతపురం డీఆర్‌ఓ మల్లీశ్వరిదేవి తెలిపారు. ఈ మేరకు ఆమె పత్రికలకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. అనుమతుల మంజూరుకు కలెక్టరేట్‌లో సింగిల్‌ విండో సిస్టం సెల్‌ ఏర్పాటు చేశామని అందులో పేర్కొన్నారు. ఎన్నికల నామినేషన్‌ వేసే, ప్రచార నిమిత్తం అభ్యర్థులు ర్యాలీ నిర్వహణ, వాహనాల ఏర్పాటుకు సెల్‌ అధికారులను సంప్రదించి అనుమతి పొందాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement