దివ్యాంగ పింఛన్ల కోసం జిల్లాలో 12 వేల మంది దరఖాస్తు చేసుకుని ఎదురుచూపులు చూస్తున్నారని దివ్యాంగ హక్కుల వేదిక జిల్లా అధ్యక్షుడు ఖండవిల్లి భరత్‌కుమార్ అన్నారు. రాయవరంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర ఏళ్లు పూర్తి కావస్తున్నా.. జిల్లాలో ఇప్పటి వరకు దివ్యాంగులకు ఒక్క పింఛన్ కూడా మంజూరు కాలేదన్నారు. ప్రభుత్వం వెంటనే దివ్యాంగుల పింఛన్లు మంజూరు చేయాలని ఆయన డిమాండ్
పింఛన్ల కోసం 12 వేల మంది దరఖాస్తు
Oct 16 2016 6:58 PM | Updated on Sep 4 2017 5:25 PM
రాయవరం :
దివ్యాంగ పింఛన్ల కోసం జిల్లాలో 12 వేల మంది దరఖాస్తు చేసుకుని ఎదురుచూపులు చూస్తున్నారని దివ్యాంగ హక్కుల వేదిక జిల్లా అధ్యక్షుడు ఖండవిల్లి భరత్‌కుమార్ అన్నారు. రాయవరంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర ఏళ్లు పూర్తి కావస్తున్నా.. జిల్లాలో ఇప్పటి వరకు దివ్యాంగులకు ఒక్క పింఛన్ కూడా మంజూరు కాలేదన్నారు. ప్రభుత్వం వెంటనే దివ్యాంగుల పింఛన్లు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దివ్యాంగుల సంక్షేమ పథకాల మంజూరు విషయంలో జన్మభూమి కమిటీల పెత్తనం ఎక్కువైందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే కాలంలో రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల నుంచి ప్రతిఘటన ఎదుర్కోక తప్పదన్నారు. ఎన్టీఆర్ గృహకల్పలో అర్హులైన దివ్యాంగులకు ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2007 దివ్యాంగుల చట్టాన్ని అనుసరించి పంచాయతీ/మున్సిపాలిటీ/కార్పొరేషన్ సంస్థల్లోని నిధుల్లో మూడు శాతం దివ్యాంగుల సంక్షేమం కోసం ఖర్చు చేయాల్సి ఉందన్నారు. అయితే ఆ మేరకు ఎక్కడా అమలు కావడం లేదన్నారు. జిల్లాలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ నెల 31న గండేపల్లిలో సమావేశమై భవిష్యత్ ప్రణాళిక ప్రకటించనున్నట్లు భరత్‌కుమార్ తెలిపారు.
Advertisement
Advertisement