వ్యక్తి దారుణ హత్య | murder in mahabubabad district | Sakshi
Sakshi News home page

వ్యక్తి దారుణ హత్య

Jun 29 2017 4:43 PM | Updated on Aug 13 2018 7:35 PM

దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్ల శివారు ఏపూరి గ్రామంలో దారుణ హత్య జరిగింది.

మహబూబాబాద్ జిల్లా: దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్ల శివారు ఏపూరి గ్రామంలో దారుణ హత్య జరిగింది. గోడ్డలి యాకయ్య అనే వ్యక్తిని అతని ఇంటి వద్ద కర్రలతో కొట్టి చంపారు. దుండగులు మృతుడి జేబులో నక్సల్స్ పేరీట లేఖ వదిలి వెళ్లారు. యాకయ్య పల్లెల్లో ఒంటరి మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నాడని, ఇతని వల్ల మహిళలకు గ్రామాల్లో రక్షణ లేకుండా పోతోందని తెలిపారు.

అంతే కాకుండా భూకబ్జాలు, దందాలు, సెటిల్‌మెంట్లు, బెదిరింపులు చేస్తూ అమాయక పేద ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని, అందువల్లే ప్రజా కోర్టులో శిక్షిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఎవరైనా ప్రజలపై , మహిళలపై అరాచకాలకు పాల్పడితే ఇదే శిక్షకు గురికాక తప్పదని సీపీఐ(ఎం ఎల్‌) పార్టీ పేరిట కామ్రేడ్‌ జగదీశ్‌ ఆ లేఖ ద్వారా తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement