breaking news
Dantalapalli
-
వ్యక్తి దారుణ హత్య
మహబూబాబాద్ జిల్లా: దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్ల శివారు ఏపూరి గ్రామంలో దారుణ హత్య జరిగింది. గోడ్డలి యాకయ్య అనే వ్యక్తిని అతని ఇంటి వద్ద కర్రలతో కొట్టి చంపారు. దుండగులు మృతుడి జేబులో నక్సల్స్ పేరీట లేఖ వదిలి వెళ్లారు. యాకయ్య పల్లెల్లో ఒంటరి మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నాడని, ఇతని వల్ల మహిళలకు గ్రామాల్లో రక్షణ లేకుండా పోతోందని తెలిపారు. అంతే కాకుండా భూకబ్జాలు, దందాలు, సెటిల్మెంట్లు, బెదిరింపులు చేస్తూ అమాయక పేద ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని, అందువల్లే ప్రజా కోర్టులో శిక్షిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఎవరైనా ప్రజలపై , మహిళలపై అరాచకాలకు పాల్పడితే ఇదే శిక్షకు గురికాక తప్పదని సీపీఐ(ఎం ఎల్) పార్టీ పేరిట కామ్రేడ్ జగదీశ్ ఆ లేఖ ద్వారా తెలియజేశారు. -
దంతాలపల్లిని మండలంగా ప్రకటించాలి
నర్సింహులపేట : దంతాలపల్లిని మం డలంగా ప్రకటించాలని డిమాండ్ చే స్తూ బుధవారం స్థానికులు చెరువులో మునుగుతూ నిరసన తెలిపారు. అనంతరం దంతాలపల్లి అంబేద్కర్ సెంటర్ వరంగల్–ఖమ్మం హైవేపై రాస్తారోకో చేశారు. మండల సాధన కమిటీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు నాయిని రఘునందన్ రెడ్డి, సర్పంచ్ కిషన్ నాయక్, ఎంపీటీసీ కిశోర్‌కుమార్, మాజీ సర్పంచ్ నాయిని శ్రీనివాస్‌రెడ్డి, జేఏసీ కన్వీనర్ ధర్మారపు వెంకన్న, బీజేపీ నియోజకవర్గ నాయకుడు చీకటి మహేష్, మండల సాధన కమిటీ సభ్యులు పాల్గొన్నారు.