ఏలూరు అర్బన్ : హత్యకేసులో నిందితునికి జీవితఖైదు విధిస్తూ.. జిల్లా ప్రిన్సిపల్ జిల్లా జడ్జి శుక్రవారం తీర్పుచెప్పారు.
హత్యకేసులో నిందితునికి జీవితఖైదు
Aug 13 2016 1:25 AM | Updated on Jul 30 2018 8:29 PM
ఏలూరు అర్బన్ : హత్యకేసులో నిందితునికి జీవితఖైదు విధిస్తూ.. జిల్లా ప్రిన్సిపల్ జిల్లా జడ్జి శుక్రవారం తీర్పుచెప్పారు. ద్వారకా తిరుమల మం డలం పంగిడిగూడెంకు చెందిన గోటూరి రవికుమార్ పాత కక్షల నేపథ్యంలో 2013 ఏప్రిల్ 9న గుమ్మటి వెంకటేశ్వరరావును కత్తితో పొడిచి హత్య చేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి కోర్టుకు నివేదించారు. వాదోపవాదాల అనంతరం నిందితునిపై నేరం రుజువు కావడంతో జిల్లా ప్రిన్సిపల్ జడ్జి తుకారాంజీ జీవిత ఖైదు, రూ.రెండువేల జరిమానా విధిస్తూ తీర్పుచెప్పారు.
Advertisement
Advertisement