డైట్‌ కళాశాల ఎదుట ధర్నా | Marched in front of the Diet college | Sakshi
Sakshi News home page

డైట్‌ కళాశాల ఎదుట ధర్నా

Aug 17 2016 1:21 AM | Updated on Sep 4 2017 9:31 AM

డీఈడీ అభ్యర్థులను గురుకుల పాఠశాలల్లో టీజీపీ ఉపాధ్యాయులుగా నియమించాలని, డీఎస్సీ నోటిఫికేషన్‌ వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ అభ్యర్థులు మంగళవారం హన్మకొండలోని డైట్‌ కళాశాల ఎదుట మంగళవారం ధర్నా చేశారు.

 
విద్యారణ్యపురి : డీఈడీ అభ్యర్థులను గురుకుల పాఠశాలల్లో టీజీపీ ఉపాధ్యాయులుగా నియమించాలని, డీఎస్సీ నోటిఫికేషన్‌ వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ అభ్యర్థులు మంగళవారం హన్మకొండలోని డైట్‌ కళాశాల ఎదుట మంగళవారం ధర్నా చేశారు. గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకానికి ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్‌ జారీ చేసిందని, అందులో డీఈడీ అభ్యర్థులకు టీజీపీగా అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు. డైట్‌ కళాశాలలో డీఈడీ అభ్యర్థులకు మెస్‌ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ ధర్నాలో డీఎస్సీ అభ్యర్థులు ధరావత్‌ రవి, రామ్మోహన్‌రెడ్డి, శ్రీనునాయక్, అనిల్, కోటె, ప్రవళిక, కవిత, మౌనిక, తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement