పెంచికలపాడు (గట్టు): సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతూ ఓ వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందిన సంఘటన గట్టు మండలంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. పెంచికలపాడుకి చెందిన చాకలి నాగన్న అలియాస్ దుబ్బన్న(30) గ్రామంలో వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు.
సెల్ చార్జింగ్ పెడుతూ వ్యక్తి మృతి
Sep 9 2016 1:33 AM | Updated on Sep 4 2017 12:41 PM
పెంచికలపాడు (గట్టు): సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతూ ఓ వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందిన సంఘటన గట్టు మండలంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. పెంచికలపాడుకి చెందిన చాకలి నాగన్న అలియాస్ దుబ్బన్న(30) గ్రామంలో వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అతడే ఆ కుటుంబానికి ఆధారం. గురువారం ఉదయం ఆయన ఇంట్లో నిద్రలేవగానే సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతున్న క్రమంలో విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీంతో అక్కడిక్కడే మృత్యువాతపడ్డాడు. కళ్ల ఎదుటే కట్టుకున్న భర్త మృత్యువాత పడడంతో ఆ ఇల్లాలి రోదనలు అక్కడి వారిని కంటతడి పెట్టించాయి. మృతుడికి భార్య దుర్గమ్మతో పాటుగా ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
Advertisement
Advertisement