రాత్రంతా కోర్టులోనే.. వ్యక్తి హల్‌చల్! | man damaged documents in cbi court | Sakshi
Sakshi News home page

రాత్రంతా కోర్టులోనే.. వ్యక్తి హల్‌చల్!

Nov 18 2016 12:09 PM | Updated on Sep 4 2017 8:27 PM

సీబీఐ కోర్టులో ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. రాత్రి మొత్తం కోర్టు భవనంలోనే ఉన్నాడు.

హైదరాబాద్: గగన్ విహార్ సీబీఐ కోర్టులో ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. నిన్న(గురువారం) సాయంత్రం కోర్టులోకి ప్రవేశించిన వ్యక్తి.. రాత్రి మొత్తం కోర్టు భవనంలోనే ఉన్నాడు. సిబ్బంది గురువారం సరిగ్గా చెక్ చేయకుండా తాళాలు వేయడంతో.. జనగామకు చెందిన శివ అనే వ్యక్తి అందులోనే ఉండిపోయాడు. మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో.. రాత్రంతా కోర్టులోనే ఉండిపోయిన ఆ వ్యక్తి కోర్టులో ఉన్న కొన్ని దస్తావేజులు చించివేశాడు.

శుక్రవారం కోర్టుకు వచ్చిన సిబ్బంది తాళాలు తెరిచిచూడగా ఓ వ్యక్తిని వారు గుర్తించారు. ఆ వెంటనే సిబ్బంది అబిడ్స్ పోలీసులకు సమాచారం అందించారు. సీబీఐ కోర్టుకు చేరుకున్న పోలీసులు శివను అదుపులోకి తీసుకున్నారు. అతను చింపివేసిన దస్తావేజుల గురించి మేజిస్ట్రేట్ ఆరా తీస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement