నూనూగు మీసాల నూత్నయవ్వనంలోనే శ్రీనాథుడు మరుత్తరాట్చరిత్రను రాశానని చెప్పుకున్నాడు..అతి పిన్న వయసులోనే అవధాన కవన మధువును చిలుకుతున్నాడీ నవ యువకుడు.Sఏయూలో బయో టెక్నాలజీ విభాగంలో ద్వితీయ సంవత్సరం చదువుతూ తెలుగు వారికే సొంతమైన, క్లిష్టతరమైన అవధాన ప్రక్రియకు పట్టం కట్టే ప్రక్రియలో పరిశ్రమిస్తున్నాడు. తాను అవధానాలు చేయడంతో పాటు అవధానాలను నిర్వహించడం, ఈ కళను ప్రోత్సహించడంలో నిమVýæ్నమై ఉన్నాడు. –ఏయూ క్యాంపస్
అభ్యసిస్తున్నది శాస్త్ర విజ్ఞానం.. ఆరితేరినదని తెలుగు భాషా శాస్త్రం.. అందెవేసినది అవధాన ప్రక్రియలో.. తాతా సందీప్ శర్మ ఆంధ్రవిశ్వవిద్యాలయంలో బయోటెక్నాలజీ విభాగంలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. చిన్నతనం నుంచి అబ్బిన తెలుగు భాషపై పట్టు, అవధాన విద్యపై ఆసక్తిని చాటుతున్నాడు. పిన్న వయసులోనే అవధానాలు నిర్వహిస్తూ అవధాన ప్రక్రియకు వారసులు వస్తున్నారనే సందేశాన్ని పంపుతున్నాడు.
కుటుంబమే ప్రేరణ
ఈ యువ అవధాని పూర్తి పేరు.. తాతా శ్రీనివాస రమాసత్య సందీప శర్మ. విశాఖ నగరంలోని విక్టోరియా జనరల్ ఆస్పత్రి(ఘోషా ఆస్పత్రి)లో 1994వ సంవత్సరంలో జన్మించారు. తండ్రి వెంకట వరప్రసాద్ న్యాయవాది, తల్లి విజయలక్ష్మి గహిణి. తన నాయనమ్మ తాతా పార్వతమ్మ తొలి గురువుగా కవితా రచనకు శ్రీకారం చుట్టారు. పద్యకళా తపస్వి డాక్టర్ ధూళిపాళ మహదేవ మణి వద్ద అవధాన ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రాథమిక విద్యను సీలేరు, రాజమండ్రిలలో పూర్తి చేశారు.
పాఠశాలలోనే పద్య రచన
సందీప్ పాఠశాలలో ఉండగా తన 10వ తరగతిలో పద్య రచన చేయడం ప్రారంభించాడు. నాటి నుంచి నేటి వరకు గేయరచన, వ్యాసరచన, వక్తత్వం, సాహిత్యోపన్యాసాలు, అష్టావధానాలలో పాల్గొని బహుమతులను అందుకున్నారు. 14 విశ్వవిద్యాలయ విద్యార్థులు పాల్గొన్న కవిత్వ పోటీలలో రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతిని అందుకున్నాడు. మహాసహస్రావధాని డాక్టర్ గరికపాటి నరసింహారావు నుంచి సరస్వతీ దేవి స్వర్ణ అంగుళీయకాన్ని, నోరి నరసింహ శాస్త్రి చారిటబుల్ ట్రస్ట్ అందించే నోరి యువ రచయిత ప్రోత్సాహక పురస్కారాన్ని 2015 సంవత్సరానికి స్వీకరించారు. ఒంగోలులో రాష్ట్ర స్థాయి రచయితల మహాసభలో కవితాగానం చేసి మహాసహస్రావధానిæగరికపాటి నరసింహారావుతో సన్మానం, మద్రాసు విశ్వవిద్యాలయంలో నిర్వహించిన 24 గంటల నిరవధిక కవిసమ్మేళనంలో పాల్గొని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం పొందారు.
అవధాన నిర్వహణ
రచయితల సమితికి అధ్యక్షుడిగా, ఆంధ్ర పద్య కవితా సదస్సు కార్యవర్గ సభ్యుడిగా, నన్నయ వాజ్ఞ్మయ వేదిక పూర్వ కార్యవర్గ సభ్యునిగా పని చేశారు. తాను అవధానాలు చేయడంతో పాటు అవధానాలను నిర్వహించడం, ఈ కళను ప్రోత్సహించడంలో భాగంగా ద్విగుణిత అష్టావధానాన్ని రాజమండ్రిలో రాంభట్ల పార్వతీశ్వర శర్మతో, పంచ కావ్యాలపై ఐదు రోజుల ప్రసంగాలను నిర్వహించారు. భద్రాచలం దేవస్థానంలో అవధానం చేసిన సమయంలో అనంతాన్ పిళ్లై ఆనువంశిక పీఠం నుంచి పురస్కారం అందుకున్నారు. రాపాక ఏకాంబరాచార్యులు ఇటీవల అవధాన విద్యా సర్వస్వం పుస్తకాన్ని రచించారు. దీనిలో 18వ శతాబ్దానికి చెందిన మాడభూషి వెంకటాచార్యులు నుంచి 1994 వరకు ఉన్న 398 మంది అవధానులకు సంబంధిచిన సమగ్ర వివరాలతో ఒక పుస్తకాన్ని తీసుకువచ్చారు. దీనిలో స్థానం సాధించిన పిన్న వయస్కుడిగా సందీప్ నిలిచారు.
11 అష్టావధానాలు
ఇప్పటివరకు సందీప్ 11 అష్టావధానాలు నిర్వహించారు. తన తొలి అవధానాన్ని తాను డిగ్రీ చవుతున్న రోజుల్లో నన్నయ సారస్వత పీఠం ఆధ్వర్యంలో రాజమండ్రిలోని ఆదిత్య డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. వివిధ శతావధానాలు, ద్విశతావధానాలలలో పచ్ఛకునిగా, సాహితీ ప్రసంగాలు ఇస్తున్నారు. అవధానంలో అంగాలుగా వ్యవహరించే నిషిద్ధాక్షరి, సమస్య, దత్తపది, వర్ణన, ఆశువు, వ్యస్తాక్షరి, ఘంటావధానం, అప్రస్తుత ప్రసంగం ప్రక్రియలలో అందెవేసిన చేయి సాధించారు. డాక్టర్ మహదేవ మణి సష్టించిన ఘంటావధానంలో సైతం ప్రావీణ్యం సాధించారు.
తెలుగులో ఉన్నత విద్యాభ్యాసమే ఆకాంక్ష
బయో టెక్నాలజీలో పరిశోధన చేయాలని, దీనికి సమాంతరంగా తెలుగులో ఉన్నత విద్యను అభ్యసించాలనే ఆకాంక్ష ఉంది. అవధాన విద్యను పరిరక్షణకు, ప్రపంచానికి చాటడానికి నిరంతరం నా వంతుగా కషి చేస్తాను. గురువుల ఆశీస్సులతో అవధాన ప్రక్రియను నిరంతరం కొనసాగించే ప్రయత్నం చేస్తాను.