పాలమూరు జిల్లాలో కుండపోత | heavyu rain in mahabub nagar district | Sakshi
Sakshi News home page

పాలమూరు జిల్లాలో కుండపోత

May 11 2016 2:25 AM | Updated on Oct 8 2018 5:07 PM

పాలమూరు జిల్లాలో కుండపోత - Sakshi

పాలమూరు జిల్లాలో కుండపోత

పాలమూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం భారీ వర్షం కురిసింది.

* ఆరు గంటలపాటు భారీ వర్షం
* 11 సెంటీ మీటర్ల వర్షపాతం

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పాలమూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం కుండపోత వర్షం కురిసింది. ఆరు గంటలపాటు  కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వర్షానికి ఈదురుగాలులు తోడవడంతో ఎస్పీ కార్యాలయం, బస్టాం డ్‌ల వద్ద భారీ వృక్షాలు నేలకొరిగాయి. కలెక్టర్ కార్యాలయం ప్రహరీ గోడ ఒకవైపు పూర్తిగా పడిపోయింది. పెద్దచెరువు అలుగుపోసింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు.

మహబూబ్‌నగర్ జిల్లా కేం ద్రంలో 11 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. చెరువులు, చెక్‌డ్యాంలకు జలకళ వచ్చింది. లోతట్టు ప్రాంతాల్లో మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ పర్యటించి.. సహాయక చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement