ముస్లిం చట్టాలలో ప్రభుత్వ జోక్యం తగదు | government intervention in muslim law is not correct | Sakshi
Sakshi News home page

ముస్లిం చట్టాలలో ప్రభుత్వ జోక్యం తగదు

Mar 26 2017 11:14 PM | Updated on Oct 16 2018 5:58 PM

ముస్లిం పర్సనల్‌ చట్టాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం తగదని, దానిని గట్టిగా వ్యతిరేకించాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముస్లిం న్యాయవాదుల సంఘం పేర్కొంది.

– ముస్లిం న్యాయవాదులు
 
కర్నూలు (లీగల్‌):  ముస్లిం పర్సనల్‌ చట్టాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం తగదని, దానిని గట్టిగా వ్యతిరేకించాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముస్లిం న్యాయవాదుల సంఘం పేర్కొంది. ఆదివారం స్థానిక బిస్మిల్లా ఫంక్షన్‌ హాలులో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ముస్లింల అభివృద్ధి కోసం సచార్, రంగనాథ్‌ కమిషన్‌ చేసిన సిఫార్సులను వెంటనే అమలు చేయాలని సమావేశం డిమాండ్‌ చేసింది. రాష్ట్రంలో న్యాయవాదుల సంక్షేమ నిధిని రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పెంచాలని, చట్ట సభల్లో ముస్లింకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని సమావేశం కోరింది. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు జవహర్‌అలీ (కాకినాడ), ప్రధాన కార్యదర్శి మొసీన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌.చాంద్‌బాష (కర్నూలు), రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఎస్‌ఎండీ అనీఫ్, అక్రమ్, మగ్భుల్, హుసేన్‌బాషా తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement