సివిల్ సప్లై గోదాముల్లో పనిచేసే హమాలీలకు ఇచ్చే కూలిని.. నగదు రూపంలో చెల్లించాలని ఏపీ సివిల్ సప్లై హమాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణ, గౌరవాధ్యక్షుడు బి.చంద్రుడు డిమాండ్ చేశారు.
కూలి నగదు రూపంలో ఇవ్వాలి
Dec 10 2016 11:56 PM | Updated on Sep 4 2017 10:23 PM
హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకుల వినతి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : సివిల్ సప్లై గోదాముల్లో పనిచేసే హమాలీలకు ఇచ్చే కూలిని.. నగదు రూపంలో చెల్లించాలని ఏపీ సివిల్ సప్లై హమాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణ, గౌరవాధ్యక్షుడు బి.చంద్రుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు శనివారం సివిల్ సప్లై డీఎం కృష్ణారెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ..హమాలీ లను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని, దసరా పండుగ బోనస్‌ను రెండు వేలకు పెంచాలని, మిఠాలకు ఇచ్చే నగదును రూ.500 చెల్లించాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు వారు వివరించారు. కార్యక్రమంలో నాయకులు జి.సుబ్బయ్య, రామదాసు పాల్గొన్నారు.
Advertisement


