హైకోర్టు ఆదేశాలను సక్రమంగా అమలు చేయని గడివేముల తహసీల్దార్ ఎం. రామసుబ్బయ్యపై జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ వేటు వేశారు.
గడివేముల తహసీల్దార్‌పై వేటు
Jan 20 2017 12:17 AM | Updated on Apr 4 2019 2:50 PM
కర్నూలు(అగ్రికల్చర్): హైకోర్టు ఆదేశాలను సక్రమంగా అమలు చేయని గడివేముల తహసీల్దార్ ఎం. రామసుబ్బయ్యపై జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ వేటు వేశారు. ఆయనను కలెక్టర్ కార్యాలయానికి సరండర్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో అక్కడే డిప్యూటీ తహసీల్దార్‌గా ఉన్న ఎస్.వెంకటరమణకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Advertisement
Advertisement