బాలికపై లైంగిక దాడి కేసులో నలుగురి అరెస్ట్‌ | four members arrest in girl Sexual assault case | Sakshi
Sakshi News home page

బాలికపై లైంగిక దాడి కేసులో నలుగురి అరెస్ట్‌

Sep 2 2017 12:17 PM | Updated on Aug 20 2018 4:30 PM

బాలికపై లైంగిక దాడి కేసులో నలుగురి అరెస్ట్‌ - Sakshi

బాలికపై లైంగిక దాడి కేసులో నలుగురి అరెస్ట్‌

బాలికపై లైంగిక దాడి కేసులో నలుగురిని సత్తుపల్లి పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు.

సత్తుపల్లిటౌన్‌:
బాలికపై లైంగిక దాడి కేసులో నలుగురిని సత్తుపల్లి పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం విలేకరుల సమావేశంలో పట్టణ సీఐ ఎం.వెంకటనర్సయ్య తెలిపిన వివరాలు...

సత్తుపల్లి మండలం బేతుపల్లి గ్రామానికి చెందిన బాలిక(14)ను అదే గ్రామానికి చెందిన వివాహితుడైన సిద్ధనబోయిన రాఘవులు పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి మంగళవారం రాత్రి ఏడు గంటల సమయంలో  స్నేహితుడు వాసం రమేష్‌ సహాయంతో ద్విచక్ర వాహనంపై పాతపాకలగూడెం సమీపంలోని పామాయిల్‌ తోటకు తీసుకెళ్లాడు. అక్కడ రాత్రి వరకు ఉన్నారు. రాఘవులు స్నేహితులైన తుంబూరుకు చెందిన గజ్జెల నారాయణ, కోటా రాములు కూడా అక్కడికి వచ్చారు. ముందుగా పెళ్లి విషయం చర్చించారు. ఆ బాలికను శారీరకంగా లోబర్చుకుంటేనే ఆమె కుటుంబీకులు పెళ్లికి అంగీకరిస్తారని రాఘవులుకు వారు సలహా ఇచ్చారు.

బాలికపై అతడు లైంగిక దాడి చేశాడు. ఆ రాత్రి అక్కడే ఉండి బుధవారం తెల్లవారుజామున రాఘవులు, తన స్నేహితుడు రమేష్‌తో బయటకు వెళ్లాడు. ఉదయం అక్కడకు వెళ్లిన కోళ్ల ఫారం యజమానికి బాలిక కనిపించింది. ఆమెను ప్రశ్నించి, ఇంటికి పంపించాడు. తల్లిదండ్రులు మందలించడంతో ఆమె అసలు విషయం చెప్పింది. ఆమె తల్లి ఫిర్యాదుతో సత్తుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. శుక్రవారం పెద్దపాకలగూడెం వద్ద రెండు ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న నిందితులు నలుగురిని అరెస్ట్‌ చేసి రిమాండుకు తరలించారు. వీరిపై నిర్భయ చట్టం, లైంగిక దాడి, కిడ్నాప్‌ కేసులు నమోదు చేశారు. రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనపర్చుకున్నారు. సమావేశంలో సత్తుపల్లి ఎస్సై జె.వసంతకుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement