రైతాంగ సమస్యలపై కాంగ్రెస్‌ పోరుబాట | fight for farmers problems | Sakshi
Sakshi News home page

రైతాంగ సమస్యలపై కాంగ్రెస్‌ పోరుబాట

Dec 6 2016 11:07 PM | Updated on Aug 18 2018 9:03 PM

రైతాంగ సమస్యలపై కాంగ్రెస్‌ పోరుబాట - Sakshi

రైతాంగ సమస్యలపై కాంగ్రెస్‌ పోరుబాట

రైతాంగ సమస్యలపై త్వరలోనే కాంగ్రెస్‌పార్టీ పోరుబాటకు సిద్ధం కావాలని ఏపీసీసీ అ«ధ్యక్షుడు ఎన్‌.రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం రాత్రి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కిసాన్‌ఖేత్‌ మజ్దూర్‌ కాంగ్రెస్‌సమీక్షా సమావేశం నిర్వహించారు.

విజయవాడ సెంట్రల్‌ : రైతాంగ సమస్యలపై త్వరలోనే కాంగ్రెస్‌పార్టీ పోరుబాటకు సిద్ధం కావాలని ఏపీసీసీ అ«ధ్యక్షుడు ఎన్‌.రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం రాత్రి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కిసాన్‌ఖేత్‌ మజ్దూర్‌ కాంగ్రెస్‌సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ టీడీపీ, బీజేపీలు ఎన్నికల్లో రైతులు, రైతు కూలీలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసేలా ఉద్యమించాలన్నారు. కర్నూలులో నిర్వహించిన రైతు సభకు మంచి స్పందన వచ్చిందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో రైతులకు పావలావడ్డీ రుణాలు, వడ్డీలేని రుణాలు అందించామన్నారు. నకిలీ విత్తనాలతో రైతులు అల్లాడిపోతున్నారన్నారు. పార్టీ నాయకులు గిడుగు రుద్రరాజు, టీజేఆర్‌ సుధాకర్‌బాబు, ఎస్‌.ఎన్‌.రాజా, తులసిరెడ్డి, రవిచంద్రరెడ్డి, కనుమూరి బాపిరాజు, కిసాన్‌సెల్‌ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement