తప్పించుకున్న దొంగ దొరికాడు! | escaped robber found | Sakshi
Sakshi News home page

తప్పించుకున్న దొంగ దొరికాడు!

Mar 22 2017 10:29 PM | Updated on Aug 30 2018 5:27 PM

తప్పించుకున్న దొంగ దొరికాడు! - Sakshi

తప్పించుకున్న దొంగ దొరికాడు!

పోలీసుల అదుపులోంచి తప్పించుకుపోయిన దొంగ షేక్‌ ఖాదర్‌ బాషాను పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు.

ఆత్మకూరు : పోలీసుల అదుపులోంచి తప్పించుకుపోయిన దొంగ షేక్‌ ఖాదర్‌ బాషాను పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. దొంగలించిన సొమ్మును రికవరీ చేశారు. స్థానిక సీఐ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ.. పట్టణంలోని గరీబ్‌ నగర్‌కు చెందిన షేక్‌ ఖాదర్‌ బాషా ఇటీవల సాయిబాబానగర్‌లో రెండు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డాడన్నారు. అలాగే నంద్యాల ఎస్‌బీఐ కాలనీ వద్ద మోటార్‌ సైకిల్‌ను దొంగతనం చేసి ఆత్మకూరుకు వస్తుండగా భానుముక్కల మలుపు వద్ద అరెస్ట్‌ చేశామన్నారు. నిందితుడి వద్ద 593.4 గ్రాముల వెండి కంచం, 165.5 గ్రాముల వెండి చెంబు, 95.1 గ్రాము వెండి గిన్నె, 248.5 గ్రాముల వెండి ప్లేటు, 50.8 గ్రాముల నాలుగు చిన్న వెండి గిన్నెలు, 14.9 గ్రాముల వెండి భరణి, ఒక నోకియా మోడల్‌ సెల్‌ఫోన్, ఏపీ 28 సీసీ 8983 నెంబర్‌ గల పల్సర్‌ బైక్, ఎల్జీ కంపెనీకి చెందిన ఎల్‌ఈడీ టీవీ, ఏపీ 21 ఏజె 0644 నెంబర్‌ గల హోండా ట్విస్టర్‌ బైక్‌, ఏపీ 21 క్యూ 1882 పల్సర్‌ను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. కార్యక్రమంలో ఆత్మకూరు సీఐ కృష్ణయ్య, పాములపాడు ఎస్‌ఐ సుధాకరరెడ్డి, ఆత్మకూరు ఎస్‌ఐ వెంకటసుబ్బయ్య, వెలుగోడు ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement