ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ప్రజా సేవకులమని గుర్తుపెట్టుకుని విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ అన్నారు. 12 రోజులుగా జిల్లా పరిధిలోని 40 మంది వీఆర్వో, వీఆర్‌ఏ, మెడికల్ ఆఫీసర్లు, వ్యవసాయ విస్తరణాధికారులకు ఇస్తున్న శిక్షణ తరగతులు శుక్రవారంతో ముగిశాయి.
ఉద్యోగులకు ముగిసిన శిక్షణ
Oct 28 2016 10:29 PM | Updated on Mar 21 2019 8:35 PM
విజయరాయి (పెదవేగి రూరల్) : ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ప్రజా సేవకులమని గుర్తుపెట్టుకుని విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ అన్నారు. 12 రోజులుగా జిల్లా పరిధిలోని 40 మంది వీఆర్వో, వీఆర్‌ఏ, మెడికల్ ఆఫీసర్లు, వ్యవసాయ విస్తరణాధికారులకు ఇస్తున్న శిక్షణ తరగతులు శుక్రవారంతో ముగిశాయి. పెదవేగి మండలం విజయరాయిలోని జైశాల్ ఒకేషనల్ శిక్షణ ప్రాంగణంలో 12 రోజులుగా వివిధ విభాగాల్లో క్షేత్రస్థాయి ఉద్యోగులకు ఇచ్చిన శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ భాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విధుల్లో ఉత్తమ నైపుణ్యం ప్రదర్శించేందుకు ఉద్యోగులకు శిక్షణ అవసరమని, అ««దlునాతన సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ప్రజలకు ఉత్తమ సేవలందించాలన్నారు. నోడల్ అధికారిణి డాక్టర్ సీహెచ్ సూర్యచక్రవేణి, నరసాపురం సబ్ ట్రెజరర్ ఎ.రవివర్మ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement