అంబేడ్కరిజం, మార్కిజం కలిస్తేనే అభివృద్ధి | Sakshi
Sakshi News home page

అంబేడ్కరిజం, మార్కిజం కలిస్తేనే అభివృద్ధి

Published Wed, Jul 27 2016 11:01 PM

అంబేడ్కరిజం, మార్కిజం కలిస్తేనే అభివృద్ధి - Sakshi

  •   సీపీఐ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కె.రామకృష్ణ 
  • పొన్నూరు : భారతదేశంలో దళితుల కోసం నిరంతరం కృషిచేస్తున్న అంబేడ్కరిజం, మార్సిజం కలిస్తేనే బహుజనులు అభివృద్ది సాధించగలరని సీపీఐ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కె.రామకృష్ణ పేర్కొన్నారు. దళిత మహాసభ నేత కత్తి పద్మారావు 63వ పుట్టినరోజు సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కన్హయ్యకుమార్‌ కూడా లాల్‌సలాం నీల్‌సలాం అని చెప్పారని గుర్తుచేశారు. అనంతరం పెరియార్‌ ఈవి రామస్వామి నాయకర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో  సత్తెనపల్లి నలంద కాలేజి ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కనపర్తి అబ్రహం లింకన్, ప్రొఫెసర్‌ పట్టేటి రాజశేఖర్, మట్టా ఝాన్సీ, న్యాయవాది పిల్లి సాగర్‌ తదితరులు పాల్గొన్నారు.
     
     

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement