బషీర్‌బాగ్‌ అమరవీరులకు నివాళి | condolence to basheerbagh martyrs | Sakshi
Sakshi News home page

బషీర్‌బాగ్‌ అమరవీరులకు నివాళి

Aug 28 2016 10:58 PM | Updated on Sep 4 2017 11:19 AM

బషీర్‌ బాగ్‌ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు ఆదివారం స్థానిక సుందరయ్య భవనంలో సంస్మరణ సభ ఏర్పాటు చేశారు

కర్నూలు సిటీ: బషీర్‌ బాగ్‌ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు ఆదివారం స్థానిక సుందరయ్య భవనంలో సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. సీపీఎం జిలా కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, నగర అద్యక్షులు గౌస్‌ దేశాయ్‌ అమరవీరుల చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2000 సంవత్సరంలో అప్పటి సీఎం చంద్రబాబు అనుసరించిన విధానాల వల్ల కార్మికులు ప్రాణాలు కోల్పోయారన్నారు. సీఎం  విధానాలపై పోరాటాలు చేయడమే అమరులకు నిజమైన నివాళి అని అన్నారు. ప్రజా వ్యతిరేఖ విధానాల వల్ల పదేళ్లు అధికారానికి దూరమైనా చంద్రబాబు తీరులో మార్పు రాలేదని, ఇకపై టీడీపీ శాశ్వతంగా సమాధి కట్టే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. సమావేశంలో సీపీఎం నాయకులు రాధాకష్ణ, అంజిబాబు, రాముడు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement