ఏలూరు (ఆర్‌ఆర్ పేట) : స్వాతంత్య్రదిన పక్షోత్సవాల్లో భాగంగా జిల్లాలోని పాఠశాల విద్యార్థులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించాలని డీఈవో డి.మధుసూదనరావు ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు పోటీలు
Aug 12 2016 10:31 PM | Updated on Sep 4 2017 9:00 AM
ఏలూరు (ఆర్‌ఆర్ పేట) : స్వాతంత్య్రదిన పక్షోత్సవాల్లో భాగంగా జిల్లాలోని పాఠశాల విద్యార్థులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించాలని డీఈవో డి.మధుసూదనరావు ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. ఈ నెల 16న 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాల చిత్రలేఖనం పోటీలు, 17న స్వాతంత్య్రోద్యమంలో గాంధీజీ పాత్ర అనే అంశంపై 6 నుంచి 10 తరగతి విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, 18న దేశభక్తి పాటల పోటీలు, 19న స్వాతంత్య్రోద్యమంపై సాంస్కృతిక నాటిక పోటీలు, 20న స్వాతంత్య్రోద్యమంలో అల్లూరి సీతారామరాజు పోరాటం అనే అంశంపై 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు వక్తృత్వ పోటీలు నిర్వహించాలని సూచించారు. 21న 3 నుంచి 10వ తరగతి విద్యార్థులకు వీరసైనికుల చిత్రాల చిత్రలేఖనం పోటీలు, 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు జాతీయ సమైక్యతపై నినాదాలు రాసే పోటీలు, 23న ఉదయం ఫ్రీడమ్ రన్ నిర్వహించి, బహిరంగ కూడలిలో జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు.
Advertisement
Advertisement