జనవరి మొదటి వారంలో సీఎం పర్యటన | cm tour in january first week | Sakshi
Sakshi News home page

జనవరి మొదటి వారంలో సీఎం పర్యటన

Dec 22 2016 12:06 AM | Updated on Sep 4 2017 11:17 PM

జనవరి మొదటి వారంలో కర్నూలు జిల్లాలో పర్యటిస్తానని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

కర్నూలు(అగ్రికల్చర్‌): జనవరి మొదటి వారంలో కర్నూలు జిల్లాలో పర్యటిస్తానని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. బుధవారం విజయవాడలో జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ముచ్చుమర్రి లిప్ట్‌ నుంచి కేసి కెనాల్‌కు నీళ్లు ఇచ్చే కార్యక్రమం చేపట్టడం మంచి పరిణామమన్నారు. కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌ కూడా పవర్‌ పాయింట్‌ ద్వారా నీటిపారుదల గురించి వివరించినట్లు సమాచారం. కర్నూలు నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో సీపీఓ ఆనంద్‌నాయక్, డ్వామా పీడీ పుల్లారెడ్డి, డీఆర్‌డీఏ పీడీ రామకృష్ణ, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, హౌసింగ్‌ పీడీ హుసేన్‌ సాహెబ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement