మీడియాను గెంటివేయాలంటూ హుకుం! | chandrababu naidu trip and media insulted | Sakshi
Sakshi News home page

మీడియాను గెంటివేయాలంటూ హుకుం!

Oct 16 2016 9:16 PM | Updated on Aug 21 2018 8:34 PM

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు(సోమవారం) పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించనున్నారు.

ఏలూరు: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు(సోమవారం) పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించనున్నారు. ఇప్పటికే పలుమార్లు ప్రాజెక్టు ఏరియాను సందర్శించిన ఆయన మరోసారి అక్కడ పరిశీలనకు వెళ్లనున్నారు. సీఎం చంద్రబాబు రానున్నారనే విషయం తెలుసుకుని ముందుగానే అక్కడికి మీడియా కవరేజీకి వెళ్లిన జర్నలిస్టులపై ట్రాన్స్ ట్రాయ్ సిబ్బంది దౌర్జన్యానికి పాల్పడ్డారు.

పోలవరం ప్రాంతానికి ఎవరు అనుమించారని చిందులేసిన పరిస్థితి తలెత్తింది. ఏకంగా మీడియా సిబ్బందిని గెంటివేయండి అంటూ హుకుం జారీ చేసినట్లుగా సమాచారం. అయితే ఈ విషయాన్ని రేపు నేరుగా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని జర్నలిస్టులు నిర్ణయించుకున్నారు. మీడియాపై ట్రాన్స్ ట్రాయ్ దౌర్జన్యాన్ని జర్నలిస్టు సంఘాలు ఖండించాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement