సెంట్రల్‌జైల్‌ బంక్‌ విస్తరణ | central jail bunk | Sakshi
Sakshi News home page

సెంట్రల్‌జైల్‌ బంక్‌ విస్తరణ

Oct 3 2016 9:45 PM | Updated on Sep 4 2017 4:02 PM

సెంట్రల్‌జైల్‌ బంక్‌ విస్తరణ

సెంట్రల్‌జైల్‌ బంక్‌ విస్తరణ

సెంట్రల్‌ జైల్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఐఓసీఎల్‌ పెట్రోల్‌ బంక్‌ అభివృద్ధి పథంలో పురోగమిస్తోంది. దీంతో ఇటు ఖైదీలకు, అటు జైలుకు మంచి ఆదాయం లభిస్తోంది. ఈ బంక్‌ను 2012లో 900 మీటర్ల స్థలంలో 3 పంపులతో ప్రారంభించారు. దీని కోసం జైళ్ల శాఖ స్థలాన్ని 28 సంవత్సరాలకు సంవత్సరానికి రూ. 53 వేల చొప్పున ఐఓసీఎల్‌కు లీజుకు ఇచ్చారు. ప్రస్తుతం ఈ బంక్‌ను 2,250 మీటర్ల స్థలంలో ఆరు పంపులతో విస్తరించేందుకు చర్యలు చేపట్ట

  • అతి స్వల్పకాలంలో విక్రయాలు పెంచి
  • బెస్ట్‌ గ్రోత్‌ అవార్డు అందుకున్న వైనం 
  • సంవత్సరానికి రూ. కోట్లలో టర్నోవర్‌ 
  •  
    జైళ్ల శాఖ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్‌ నిర్వహిస్తున్న పెట్రోలు బంక్‌ దినదిన ప్రవర్థమానమవుతూ విస్తరణ బాట పట్టింది. 2012లో మూడు పంపులతో మొదలైన ఈ బంక్‌ ఆరు పంపులకు విస్తరించనుంది.
     
    రాజమహేంద్రవరం క్రైం: 
    సెంట్రల్‌ జైల్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఐఓసీఎల్‌ పెట్రోల్‌ బంక్‌ అభివృద్ధి పథంలో పురోగమిస్తోంది. దీంతో ఇటు ఖైదీలకు, అటు జైలుకు మంచి ఆదాయం లభిస్తోంది. ఈ బంక్‌ను 2012లో 900 మీటర్ల స్థలంలో 3 పంపులతో ప్రారంభించారు. దీని కోసం జైళ్ల శాఖ స్థలాన్ని 28 సంవత్సరాలకు సంవత్సరానికి రూ. 53 వేల చొప్పున ఐఓసీఎల్‌కు లీజుకు ఇచ్చారు.  ప్రస్తుతం ఈ బంక్‌ను 2,250 మీటర్ల స్థలంలో ఆరు పంపులతో విస్తరించేందుకు చర్యలు చేపట్టారు. ఈ లీజు ద్వారా సెంట్రల్‌జైలుకు రూ. 1.10 లక్షల ఆదాయం సమకూరింది. దీంతో పాటు ఇక్కడ అమ్మే ప్రతి లీటర్‌ పెట్రోల్‌కు రూ. 2.25, డీజిల్‌కు రూ. 1.20 కమీషన్‌ రూపంలో జైళ్లశాఖకు అందుతోంది. అతిస్వల్పకాలంలో అధిక విక్రయాలు సాధించిన ఈ బంక్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో విశాఖపట్నంలో ఐఓసీఎల్‌ అధికారుల చేతుల మీదుగా బెస్ట్‌ గ్రోత్‌ అవార్డును జైళ్ల శాఖ అధికారులు అందుకున్నారు. గతంలో ఈ బంక్‌లో మూడు షిఫ్ట్‌ల్లో 18 మంది ఖైదీలు పని చేసేవారు. ప్రస్తుతం పెంచిన బంక్‌ స్థాయితో అదనంగా మరో 20 మంది పని చేసేందుకు అవకాశం ఉంది. గతంలో రోజుకు రూ. 9 లక్షల అమ్మకాలు జరగగా, ప్రస్తుతం ప్రతీ రోజు  రూ. 14 లక్షల అమ్మకాలు జరుగుతున్నాయి. దీంతో ప్రతీ నెల సెంట్రల్‌ జైల్‌కు రూ. 12 లక్షల వరకూ ఆదాయం లభిస్తుంది. రాష్ట్రంలో జైళ్ళ శాఖ కడప, అనంతపురం, రాజమహేంద్రవరంలలో పెట్రోల్‌ బంకులు నిర్వహిస్తోంది. తెలంగాణ  రాష్ట్రంలోని చంèlల్‌ గూడా జైల్‌ పెట్రోల్‌ బంక్‌ రోజుకు రూ. 25 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకూ ఆమ్మకాలు నిర్వహించి ప్రథమ స్థానంలో నిలవగా, రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్‌ బంక్‌ ప్రతీ రోజు రూ. 14 లక్షల అమ్మకాలు జరిపి ద్వితీయ స్థానంలో నిలిచింది. తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన జైళ్ల శాఖ సిబ్బంది ఇక్కడకు వచ్చి  ఈ బంక్‌ నిర్వహణ విధానాన్ని ఇటీవల పరిశీలించారు. 
     
    ఖైదీలకు ఉపాధి
    బంక్‌లో ఇక్కడ మూడు షిఫ్ట్‌ల్లో 18 మంది ఖైదీలు పనిచేస్తున్నారు. ఒక్కొక్క ఖైదీ రోజుకు ఎనిమిది గంటలు పని చేసినందుకు రూ. 70 గౌరవ వేతనంగా చెల్లిస్తున్నారు. ఈ సోమ్ము ఖైదీల బ్యాంక్‌ అకౌంట్‌లో జమ అవుతుంది. ఇక్కడ పని చేసే ఖైదీలు ఒపెన్‌ ఎయిర్‌ జైల్‌లో ఉండేవారు. ఇక్కడ పని చేసే ఖైదీలకు స్వేచ్ఛ ఉంటుంది. ఎనిమిది గంటలు అమ్మిన అమ్మకాలు వారు డ్యూటీ దిగిపోయే సమయంలో బంక్‌ నిర్వహణ బాధ్యలు నిర్వహించే జైలర్‌ రమేష్‌కు గాని, సంబంధిత అధికారులకు గానీ అప్పగించాలి.  
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement