తమ్ముడి పెళ్లి చూపులకు వచ్చిన అన్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన మంగళవారం మండల పరిధిలోని కలచట్ల సమీపంలో చోటు చేసుకుంది.
తమ్ముడి పెళ్లి చూపులకు వచ్చి ..
Nov 9 2016 12:24 AM | Updated on Apr 3 2019 7:53 PM
- రోడ్డు ప్రమాదంలో అన్న మృతి
కలచట్ల(ప్యాపిలి): తమ్ముడి పెళ్లి చూపులకు వచ్చిన అన్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన మంగళవారం మండల పరిధిలోని కలచట్ల సమీపంలో చోటు చేసుకుంది. దేవనకొండ మండలం అలార్‌దిన్నెకు చెందిన ఈరమ్మ, వెంకటేశ్ దంపతులకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం. రెండో కుమారుడు రామాంజనేయులుకు పెళ్లి చూపుల కోసం అన్న రామకృష్ణ (30)తో పాటు కుటుంబ సభ్యులు ఆటోలో మంగళవారం కలచట్ల గ్రామానికి చేరుకున్నారు. సంబంధం నచ్చడంతో ప్యాపిలిలో పురోహితుడితో మాట్లాడి సంబంధం కుదుర్చుకునేందుకు పెళ్లికొడుకు అన్న రామకృష్ణతో పాటు మరి కొందరు ఆటోలో ప్యాపిలికి బయలు దేరారు. కలచట్ల దాటిన తర్వాత ప్యాపిలికి వచ్చే మార్గంలో మలుపు వద్ద ఆటో అదుపు తప్పి బోల్తా పడటంతో రామకృష్ణ అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. తమ్ముడి పెళ్లి చూపులకు వచ్చి అన్న రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడటంతో ఆ ఇంట విషాదం నెలకొంది. మృతుడికి భార్య హనుమంతమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ప్యాపిలి పోలీసులు తెలిపారు.
Advertisement
Advertisement