ఎక్సైజ్‌ కోర్టు జడ్జిగా బాలకోటేశ్వరరావు | balakoteswar rao as exise court judge | Sakshi
Sakshi News home page

ఎక్సైజ్‌ కోర్టు జడ్జిగా బాలకోటేశ్వరరావు

Mar 30 2017 11:19 PM | Updated on Aug 31 2018 8:31 PM

కర్నూలు ఎక్సైజ్‌ కోర్టు మెజిస్ట్రేట్‌గా కె.బాలకోటేశ్వరావును నియమిస్తూ రాష్ట్ర హైకోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

కర్నూలు(లీగల్‌): కర్నూలు ఎక్సైజ్‌ కోర్టు మెజిస్ట్రేట్‌గా కె.బాలకోటేశ్వరావును నియమిస్తూ రాష్ట్ర హైకోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఎక్సైజ్‌ కోర్టు మెజిస్ట్రేట్‌గా పని చేస్తున్న పి.రాజును కర్నూలు ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జిగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. గత నవంబర్‌ నుంచి ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి పోస్టు ఖాళీగా ఉండటంతో పి.రాజు నాలుగు నెలల నుంచి ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. అయితే ఎట్టకేలకు అదే పోస్టుకు ఆయనను బదిలీ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement