ఏటీఎం కేంద్రాల వద్ద మాటు వేసి.. | ATM thief arrested in warangal district | Sakshi
Sakshi News home page

ఏటీఎం కేంద్రాల వద్ద మాటు వేసి..

Jun 11 2017 9:03 PM | Updated on Sep 5 2017 1:22 PM

ఏటీఎం కేంద్రాల వద్ద మాటు వేసి..

ఏటీఎం కేంద్రాల వద్ద మాటు వేసి..

ఏటీఎం కేంద్రాలకు వచ్చే వృద్దులు, అమాయకలను మోసగించి డబ్బులు కాజేస్తున్న ఓ దొంగను వరంగల్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు

వరంగల్‌: తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఏటీఎం కేంద్రాలకు వచ్చే వృద్దులు, అమాయకలను మోసగించి డబ్బులు కాజేస్తున్న ఓ దొంగను వరంగల్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్బంగా సీపీ సుధీర్ బాబు విలేకరులతో మాట్లాడుతూ.. ఏటీఎం కేంద్రాల వద్ద మాటువేసి.. అక్కడకు వచ్చే అమాయకులకు సహాయపడుతున్నట్లు నటిస్తూ.. దృష్టి మరల్చి ఏటీఎం కార్డును దొంగిలించి ఆ కార్డుతో మరో ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తుంటాడు.

ఈ అంతర్ రాష్ట్ర దొంగను వరంగల్ సీసీఎస్‌ పోలీసులు ఆదివారం అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు  నిందితుడి నుండి సుమారు రూ. 4లక్షల 20 వేల నగదు, రూ.40 వేల విలువ గల మొబైల్ ఫోన్, వివిధ భ్యాంకులకు చెందిన 27 డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు సుధీర్‌ బాబు వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement