సంగం : సంగంలో ఐటీఐ కళాశాల భవన నిర్మాణాలు చేపట్టేందుకు అవసరమైన నిధుల కోసం నివేదికలు పంపామని ఐటీఐ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపల్ మురళీకష్ణ తెలిపారు.
అనుమతుల కోసం నివేదిక పంపాం
Jul 28 2016 11:49 PM | Updated on Sep 4 2017 6:46 AM
	సంగం : సంగంలో ఐటీఐ కళాశాల భవన నిర్మాణాలు చేపట్టేందుకు అవసరమైన నిధుల కోసం నివేదికలు పంపామని ఐటీఐ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపల్ మురళీకష్ణ తెలిపారు. కళాశాల భవన నిర్మాణ జాప్యంపై ‘భూములిచ్చారు.. నిధులు మరిచారు’ అని ఇటీవల సాక్షి దినపత్రికలో కథనం ప్రచురితమైంది. విద్యార్థి సంఘాలు సైతం నిర్మాణం చేపట్టాలని ఆందోళనలు చేస్తున్నారు. దీనిపై స్పందించిన తహసీల్దారు రామాంజనేయులు ప్రిన్సిపల్‌ను గురువారం తన కార్యాలయానికి పిలుపించుకుని మాట్లాడారు. భవన నిర్మాణం కోసం రూ.7.3 కోట్లు ఖర్చవుతుందని నివేదికలు పంపామని, నిధులు మంజూరైన వెంటనే నిర్మాణం ప్రారంభిస్తామని తహసీల్దారుకు తెలిపారు. విద్యార్థులు ఇబ్బందులు పడకుండా చూడాలని తహసీల్దారు మురళీకష్ణకు సూచించారు. 
Advertisement
Advertisement

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
