కందుకూరు రోడ్డు ప్రమాద ఘటనలో గాయపడ్డ క్షతగాత్రులపట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.
ఒంగోలు: కందుకూరు రోడ్డు ప్రమాద ఘటనలో గాయపడ్డ క్షతగాత్రులపట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రమాదంలో గాయపడిన వారి ఆరోగ్య విషయంలో రెండో రోజే ప్రభుత్వం చేతులెత్తేసింది. రోడ్డు ప్రమాదంలో గాయపడినవారిలో సుమారు 30 మంది క్షతగాత్రులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
కేవలం 8మందికే వైద్య ఖర్చులు ప్రభుత్వం భరిస్తుంది అంటూ..ఒంగోలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి ఆర్డీవో శ్రీనివాసరావు సర్క్యులర్ జారీ చేశారు. గాయపడ్డ మిగతావారిని తమ సొంత ఖర్చులతో వైద్యం చేయించుకోమనండి..లేదంటే ప్రభుత్వాస్పత్రికి పంపించేయండి అని ఆర్డీవో ఆదేశాలు ఇచ్చారు. దీంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో క్షతగాత్రులు సతమతమవుతున్నారు.