ఆంధ్రా ఆర్గానిక్స్‌ పైప్‌లైన్‌ లీకు | Andhra Organics pipeline leak | Sakshi
Sakshi News home page

ఆంధ్రా ఆర్గానిక్స్‌ పైప్‌లైన్‌ లీకు

Jan 17 2017 4:58 AM | Updated on Aug 18 2018 4:35 PM

ఆంధ్రా ఆర్గానిక్స్‌ రసాయన పరిశ్రమకు సంబంధించి వ్యర్థ జలాలు తరలించేందుకు మండలంలోని దోనిపేట సముద్రం వరకు పైపులైను వేశా రు.

రణస్థలం: ఆంధ్రా ఆర్గానిక్స్‌ రసాయన పరిశ్రమకు సంబంధించి వ్యర్థ జలాలు తరలించేందుకు మండలంలోని దోనిపేట సముద్రం వరకు పైపులైను వేశా రు. ఈ పైపులైను అక్కయ్యపాలెం వద్ద సోమవారం లీకైంది.దీంతో వ్యర్థ జలాలు సమీపంలోని గెడ్డలోనికి, పొలాల్లోనికి ప్రవేశించడంతో రైతులు, స్థాని కులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైప్‌లైన్‌ లీక్‌ కావడంతో ఈ కంపెనీకి సాధారణంగా మారిపోయిం దని, ఎన్నిసార్లు చెప్పినా వారు పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. పైప్‌లైన్‌ లీకేజీ వల్ల దుర్వాసన వస్తోందని, చుట్టు పక్కల పొలం పనులు కూడా చేయలేకపోతున్నామని చెబుతున్నారు. ఉద యం 5 గంటలకు పైప్‌లైన్‌ లీకైనట్లు సమాచారం అందిస్తే యాజమాన్యం 11 గంటలకు గానీ రాలేదని వారు తెలిపారు. ఆంధ్రా ఆర్గానిక్స్‌ పైపులైను సమీపంలోనే అరబిందో ఫార్మా, ల్యాన్‌ టెక్, సరకా వంటి కంపెనీల వ్యర్థ జలాలు తరలించే పైపులైన్లు ఉన్నా వాటి వల్ల ఎలాంటి నష్టం లేదని, ఇవి మాత్రమే చాలా పైకి ఉండి ఎప్పటికప్పుడు లీకవుతున్నాయని ఆరోపించారు. దీనివల్ల రైతులకు చాలా ఇబ్బందిగా ఉందని, యాజమాన్య ప్రతి నిధులు స్పందించి దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇబ్బందిగా ఉంది
పైప్‌లైన్‌ లీకుల వల్ల రైతులు చాలా ఇబ్బం దులు పడుతున్నారు. నా పొలం గెడ్డ అవతల ఉం ది. ఈ పైపులైను భూమి పైకి ఉండటం వల్ల నాటుబళ్లు వెళ్లటం కష్టంగా ఉంది.
– లంకలపల్లి రామరావు, మాజీ వైస్‌ సర్పంచ్‌

పట్టించుకోవడం లేదు
పైప్‌లైన్‌ భూమి లోపలకు ఏర్పాటు చేయాలని చాలాసార్లు యాజమాన్యానికి చెప్పాం. అయినా పట్టించుకోవడం లేదు. రైతులం దరం కలిసి అడిగితే పోలీస్‌ కేసులు పెడుతున్నారు.
– నాగవరపు బాబూరావు, రైతు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement