వధూవరులతో సినీనటుడు ఆలీ
మండలంలోని జగన్నాథవలస గ్రామస్తులు సినీ నటుడు ఆలీతో జాలీగా గడిపారు. గ్రామానికి చెందిన బొత్స వైకుంఠరావు, దివ్యల వివాహ వేడుకలో పాల్గొనేందుకు ఆలీ ఆదివారం వచ్చారు. ఆయనను చూసేందుకు జాడ, జగన్నాథవలస, కొయ్యానపేట, ఎందువ, జి.సిగడాం గ్రామాల ప్రజలు తరలివచ్చారు.
జి.సిగడాం: మండలంలోని జగన్నాథవలస గ్రామస్తులు సినీ నటుడు ఆలీతో జాలీగా గడిపారు. గ్రామానికి చెందిన బొత్స వైకుంఠరావు, దివ్యల వివాహ వేడుకలో పాల్గొనేందుకు ఆలీ ఆదివారం వచ్చారు. ఆయనను చూసేందుకు జాడ, జగన్నాథవలస, కొయ్యానపేట, ఎందువ, జి.సిగడాం గ్రామాల ప్రజలు తరలివచ్చారు. ఆలీ మాటలకు ఉబ్బితబ్బిబ్బయ్యారు. సినీ డైలాగులకు కేరింతలు కొట్టారు. శ్రీకాకుళం జిల్లా అంటే ఇష్టమని, ఇక్కడి ప్రజల అభిమానాన్ని మరువలేనంటూ ఆలీ పేర్కొన్నారు. పెళ్లికుమారుడు వైకుంఠరావు ఆలీ దగ్గర మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఆలీని స్థానిక సర్పంచ్ పంచిరెడ్డి బంగారునాయుడు, బానాన సూర్యనారాయణలు సాదర స్వాగతం పలికారు.