వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనంతపురం జిల్లాలో చేపట్టిన నాలుగో విడత 'రైతు భరోసా యాత్ర'లో భాగంగా మూడో రోజు శుక్రవారం ధర్మవరం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.
అనంతపురం: అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న రైతు, చేనేత కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనంతపురం జిల్లాలో చేపట్టిన నాలుగో విడత 'రైతు భరోసా యాత్ర'లో భాగంగా మూడో రోజు శుక్రవారం ధర్మవరం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివచ్చారు.
ధర్మవరంలో వీరారెడ్డి, గోవర్ధన్ కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అప్పులబాధతో ఆత్మహత్యకు పాల్పడిన మరో ముగ్గురి కుటుంబాలను ఈ రోజు వైఎస్ జగన్ పరామర్శిస్తారు.