19 గొర్రె పిల్లల అనుమానాస్పద మృతి | Sakshi
Sakshi News home page

19 గొర్రె పిల్లల అనుమానాస్పద మృతి

Published Fri, Mar 17 2017 11:52 PM

19 mini sheeps suspicious death

యల్లనూరు (శింగనమల) : యల్లనూరు మండలం బుక్కాపురంలో 19 గొర్రె పిల్లలు శుక్రవారం ఉదయం అనుమానాస్పద స్థితిలోమృతి చెందాయి. గొర్రెల కాపరి శ్రీనివాసులు సమాచారం మేరకు మండల పశువైద్యాధికారి శివసాగర్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిర్వహించారు. అవి ఏ కారణంతో చనిపోయాయో నిర్ధారించేందు కోసం వాటి నమూనాలను జిల్లా కేంద్రంలోని పశుసంవర్ధక శాఖ కార్యాలయానికి పంపినట్లు పశువైద్యాధికారి తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement