జనగామలో 144 సెక‌్షన్ ఎత్తివేత
జనగామలో కొనసాగుతున్న 144 సెక‌్షన్‌ను తొలగించామని డీఎస్పీ పద్మనాభరెడ్డి ఆదివారం తెలిపారు. జిల్లా ఉద్యమ సమయంలో జరిగిన విధ్వంసాల దృష్టా్య శాంతిభద్రతల పరిరక్షణకు 144 సెక‌్షన్‌ను అమలు చేశామని చెప్పారు. ఇది అమల్లో ఉన్న సమయంలో జనజీవనానికి ఎలాంటి ఇబ్బందులూ కలుగలేదన్నారు. ఆందోళనకారులు అల్లర్లకు పాల్పడితే 144 సెక‌్షన్ తిరిగి అమలులోకి వస్తుందని హెచ్చరించారు.
జనగామ : జనగామలో కొనసాగుతున్న 144 సెక‌్షన్‌ను తొలగించామని డీఎస్పీ పద్మనాభరెడ్డి ఆదివారం తెలిపారు. జిల్లా ఉద్యమ సమయంలో జరిగిన విధ్వంసాల దృష్టా్య శాంతిభద్రతల పరిరక్షణకు 144 సెక‌్షన్‌ను అమలు చేశామని చెప్పారు. ఇది అమల్లో ఉన్న సమయంలో జనజీవనానికి ఎలాంటి ఇబ్బందులూ కలుగలేదన్నారు. ఆందోళనకారులు అల్లర్లకు పాల్పడితే 144 సెక‌్షన్ తిరిగి అమలులోకి వస్తుందని హెచ్చరించారు.
కాంగ్రెస్ నేతల సంబురాలు..
జనగామలో 85 రోజులుగా కొనసాగుతున్న 144 సెక‌్షన్‌ను పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కృషితోనే తొలగించారని కాంగ్రెస్ నాయకులు ఆదివారం సంబురాలు జరుపుకున్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జి చెంచారపు శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో బాణాసంచా పేల్చి నినాదాలు చేశారు. పొన్నాల లక్ష్మయ్య డీజీపీ అనురాగ్‌శర్మను కలిసి 144 సెక‌్షన్ ఎత్తివేయాలని కోరారని గుర్తు చేశారు. జిల్లా సాధన కోసం ప్రత్యేక కార్యాచరణ చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు ధర్మపురి శ్రీనివాస్, మేకల రాంప్రసాద్, వెన్నెం సత్యనిరంజన్‌రెడ్డి, ఆలేటి సిద్దిరాములు, జక్కుల వేణుమాధవ్, మినుకూరి మహేందర్ రెడ్డి, ఎండి మాజీద్, రంగు రవి, పట్టూరి శ్రీను, బొట్ల చిన శ్రీను, బూడిద గోపి, పండ్ల రాజు, కొండ కిరణ్ పాల్గొన్నారు. కాగా, మాజీ ఎమ్మెల్యే సీహెచ్ రాజారెడ్డి కూడా సంబురాలకు హాజరయ్యారు.