లండన్‌లో 'కేసీఆర్‌ ఫర్ ఫార్మర్స్ అండ్‌ వీవర్స్' ర్యాలీ | kcr for farmers rally in london | Sakshi
Sakshi News home page

లండన్‌లో 'కేసీఆర్‌ ఫర్ ఫార్మర్స్ అండ్‌ వీవర్స్' ర్యాలీ

Aug 9 2017 7:37 PM | Updated on Aug 15 2018 9:37 PM

ఎన్ఆర్ఐ టీఆర్‌ఎస్‌ యూకే విభాగం ఆధ్వర్యంలో లండన్‌లో 'కేసీఆర్‌ ఫర్ ఫార్మర్స్ అండ్‌ వీవర్స్' ర్యాలీని నిర్వహించారు.

లండన్‌ :  
ఎన్ఆర్ఐ టీఆర్‌ఎస్‌ యూకే విభాగం ఆధ్వర్యంలో లండన్‌లో 'కేసీఆర్‌ ఫర్ ఫార్మర్స్ అండ్‌ వీవర్స్' ర్యాలీని నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలపై అవగాహాన పెంచాలని ఈ శాంతి ర్యాలీ నిర్వహించినట్టు ఎన్ఆర్ఐ టీఆర్‌ఎస్‌ యూకే ఉపాధ్యక్షుడు అశోక్ గౌడ్ దుసారి తెలిపారు. రైతుల సంక్షేమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలను, మరెన్నో కార్యాక్రమాలను చేస్తూ ఒక రైతు పక్షపాతిగా పాలన సాగిస్తున్నారని కొనియాడారు.

లండన్లోని అంబేద్కర్ హౌస్ నుంచి ప్రారంభమైన ర్యాలీ, సెంట్రల్ లండన్ మీదుగా భారత హై కమిషన్ కార్యాలయం వద్ద ఉన్న నెహ్రు విగ్రహం వరకు జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే 'జాతీయ పసుపు బోర్డు'ను ఏర్పాటు చేసి పసుపు రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎంపీ కవిత చేస్తున్న పోరాటానికి దేశమంతా మద్దత్తు ఇచ్చి విజయవంతం చేయాలనీ కోరారు. తెలంగాణ హరితహారంలో అందరూ భాగస్వాములు అవ్వాలని సూచించారు. చేనేత వస్త్రాలు ధరించి నేతన్నలకు చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు.


ఎన్ఆర్ఐ టీఆర్‌ఎస్‌ యూకే  విభాగం అధ్యక్షులు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ నాటి తెలంగాణ ఉద్యమం నుండి నేటి బంగారు తెలంగాణ నిర్మాణం వరకు తమ వంతు బాధ్యతగా తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ నాయకత్వానికి సంఘీభావంగా ఎన్నో కార్యక్రమాలు చేశామన్నారు.

ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అనిల్ కూర్మాచలం, ఉపాధ్యక్షులు అశోక్ గౌడ్ దూసరి, శ్రీకాంత్ పెద్దిరాజు,  ప్రధాన కార్యదర్శి  రత్నాకర్ కడుదుల, కార్యదర్శిలు  శ్రీధర్ రావు తక్కలపెల్లి, సృజన్ రెడ్డి చాడా, ముఖ్య నాయకులు హరి నవపేట్, రాజేష్ వర్మ, శ్రీకాంత్ జెల్లా, రవి రతినేని, సురేష్ బుడగం, వినయ్ ఆకుల, సత్య చిలుముల, రమేష్ ఎసెంపల్లి, నవీన్ మాదిరెడ్డి, వేణు, జాగృతి యూకే అధ్యక్షుడు సుమన్ రావు బాలమూరి, జాగృతి  నాయకులు లండన్ గణేష్, వంశీ  సముద్రాల తదితరులు హాజరైన వారిలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement