ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి దీక్ష | Young Girl Protest For Her Marriage In Chittoor | Sakshi
Sakshi News home page

ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి దీక్ష

Feb 16 2020 12:17 PM | Updated on Feb 16 2020 12:17 PM

Young Girl Protest For Her Marriage In Chittoor - Sakshi

ప్రియుడి ఇంటి ముందు ధర్నా చేస్తున్న ప్రియురాలు

సాక్షి, తిరుపతి క్రైం: ప్రేమించిన వ్యక్తి తనకు కావాలంటూ ఓయువతి ప్రియుడి ఇంటి ముందు దీక్ష చేసిన ఘటన నగరంలోని కొర్లగుంటలోని నవోదయ నగర్‌లో శనివారం చోటు చేసుకుంది. బాధితురాలు, ఈస్టు పోలీసులు తెలిపిన వివరాల మేరకు తిరుపతి రూరల్‌ అవిలాలకు  చెందిన మునిలక్ష్మి చదువుకునే సమయంలో కొర్లగుంటకు చెందిన చంద్రమౌలితో పరిచమై ప్రేమగా మారింది,  ఈ ప్రేమ వ్యవహారం మునిలక్ష్మి ఇంట్లో తెలిసిపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు చంద్రమౌలి ఇంటికి వెళ్లి ఇరువురికి పెళ్లి చేయాలని కోరారు.

అయితే చంద్రమౌలి తల్లిదండ్రులు ఒప్పుకోలేదన్నారు. అయితే దీనిపై మూడు నెలల ముందే యువతి తిరుచానూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే ఆ సమయంలో పోలీసులు చీటింగ్‌  కేసు నమోదు చేశారు. ఆ సమయంలో యువకుడు, వారి కుటుంబీకులు పెళ్లి చేసుకుంటామంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే తాజాగా చంద్రమౌలిని బెంగళూరుకు పంపించేశారు. దీంతో పెళ్లి వ్యవహార జాప్యం కావడంతో మహిళా సంఘాలతో కలసి ప్రియుడి ఇంటిముందే ప్రియురాలు బైటాయించింది. స్థానిక పోలీసులు ఇరువర్గాలను పోలీసుస్టేషన్‌కు పిలిపించి తిరిగి తిరుచానూరు పోలీసు స్టేషన్‌కు పంపారు. కాగా బాధిత యువతి తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యమని, ఆ అబ్బాయితోనే పెళ్లిచేయాలని కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement