గత నెల 30న తిరుపతి సమీపంలో జరిగిన చిన్నారి మురళి(9) హత్య కేసులో నిందితుడు పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు.
తిరుపతి: గత నెల 30న తిరుపతి సమీపంలో జరిగిన చిన్నారి మురళి(9) హత్య కేసులో నిందితుడు పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. బాలుడి తల్లి అరుణ, ఆటోడ్రైవర్ సోమశేఖరరాజు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. మురళి తల్లితో తనకు అక్రమ సంబంధం ఉందని రాజు అంగీకరించాడు.
అరుణ ఒత్తిడి మేరకే మురళిని హత్య చేసినట్టు చెప్పాడు. తమ అక్రమ సంబంధం గురించి మురళికి తెలిసిపోయిందని, తమ గట్టు బయటపెడతాడనే భయంతో అతడిని చంపానని తెలిపాడు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ ప్రాంతంలోని బైపాస్‌రోడ్డుకు సమీపంలో నిర్జన ప్రదేశంలో మురళిని పెట్రోల్ పోసి సజీవదహనం చేశారు.