యువతి ఎదుట ఆటోడ్రైవర్‌ వికృత చర్య | Woman Flashed At By Auto Driver In Mumbai | Sakshi
Sakshi News home page

యువతి ఎదుట ఆటోడ్రైవర్‌ వికృత చర్య

Jun 24 2019 10:39 AM | Updated on Jun 24 2019 10:58 AM

Woman Flashed At By Auto Driver In Mumbai   - Sakshi

 యువతి ఎదుట ఆటోడ్రైవర్‌ దుశ్చర్య

ముంబై : కామాంధుల వికృత చేష్టలకు బ్రేక్‌ పడటం లేదు. జాగింగ్‌కు వెళ్లిన యువతి ఎదుట ఓ ఆటోడ్రైవర్‌ విశృంఖలంగా ప్రవర్తించిన ఘటన ముంబైలో వెలుగుచూసింది. హిరనందాని ప్రాంతంలో తాను జాగింగ్‌కు వెళ్లి బ్యాంకు ఏటీఎం మెట్ల వద్ద కూర్చుని ఫోన్‌ చూస్తున్నానని బాధితురాలు వెల్లడించారు. తాను తల పైకి ఎత్తిచూడగా ఎదురుగా ఆటోలో కూర్చున్న వ్యక్తి తనవైపు చూస్తూ వికృత చేష్టకు పాల్పడటం గమనించానని చెప్పారు.

మేనేజ్‌మెంట్‌ స్టూడెంట్‌ అయిన బాధితురాలు వెంటనే ముంబై పోలీసులకు ట్వీట్‌ చేయగా పోలీస్‌ బృం‍దం అక్కడికి చేరుకుంది. ఆటోలో కూర్చున్న వ్యక్తి ఆటోడ్రైవర్‌ యూనిఫాంలో ఉన్నాడని బాధితురాలు చెప్పారు. తాను 2015 నుంచి ముంబైలో ఉంటున్నా ఇలాంటి పరిస్థితి ఎదురవడం ఇదే తొలిసారి అని చెప్పారు. కాగా, ఈ విషయాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని,  అనుమానితుడిని త్వరలో నిర్బంధంలోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement