గ్రీవెన్స్‌సెల్‌కు వచ్చిన మహిళ మృతి 

Woman Died By Heart Attack In Srikakulam - Sakshi

మృత్యువు ఎవరిని ఎలా కబళిస్తుందో చెప్పలేం. ప్రజా సమస్యపై అధికారులకు ఫిర్యాదు చేసేం దుకు వచ్చిన ఓ మహిళ అకస్మాత్తుగా.. అందరి      కళ్లెదుటే కుప్పకూలి మృత్యువు ఒడిలోకి చేరింది. ఈ విషాద సంఘటన జి.సిగడాం ఎంపీడీవో కార్యాలయం వద్ద సోమవారం చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని బొబ్బిలివీధికి చెందిన కెల్ల అన్నపూర్ణ (65) ప్రాణాలు కోల్పోయి కుటుంబ సభ్యులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వివరాల్లోకి వెళితే..  

జి.సిగడాం శ్రీకాకుళం : బొబ్బిలివీధిలో గత ఆరు నెలలుగా మంచినీటి కుళాయిలు పని చేయడంలేదు. ఈ సమస్యపై స్థానికులు పలుమార్లు అధికారులకు విన్నవించినప్పటికీ సమస్య పరిష్కారం కాలే దు. దీంతో మరోసారి గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదు చేయాలని భావించారు. ఇదే వీధికి చెందిన ఇజ్జి లక్ష్మి, శాంతికుమారి, విశాలాక్షి, పార్వతి, అప్పలనారాయణమ్మ, శ్రీదేవి తదితరులతో కలిసి కెల్ల అన్నపూర్ణమ్మ కూడా మండల పరిషత్‌ కార్యాలయానికి సోమవారం వచ్చారు.

మెట్లు ఎక్కుతుండగా అన్నపూర్ణమ్మ  సొమ్మసిల్లి పడిపోయింది. వెంటనే తోటి మహిళలు ఈమెకు సపర్యలు చేయడంతో పాటు ప్రాథమిక చికిత్స అందించేందుకు స్థానికంగా ఉన్న ఓ ఆర్‌ఎంపీ వైద్యుడిని రప్పించారు. అన్నపూర్ణమ్మను పరీ క్షించిన  వైద్యుడు అప్పటికే ఆమె చనిపోయినట్టు ధ్రువీకరించారు.

అప్పటి వరకూ అందరి తో కలిసి..కలివిడిగా మాట్లాడిన అన్నపూర్ణమ్మ ఇక లేరని తెలిసి తోటి మహిళలు కన్నీటి పర్యం తమయ్యారు. విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకొని భోరున విలపించారు. మృతురాలి అన్నపూర్ణకు భర్త నర్శింహులు, ఇద్దరు కుమారులు ఉన్నారు. 

అధికారుల నిర్లక్ష్యం!

బొబ్బిలివీధిలో గత ఆరు నెలలుగా  కుళాయిలు పని చేయడం లేదు. దీంతో నీటి సమస్యను ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పుడు కూడా ఇదే సమస్యను మరోసారి అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు మహిళలు వచ్చారు.

ఈ క్రమంలో అన్నపూర్ణమ్మ అర్ధంతరంగా తనువుచాలించింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘోరం జరిగిందని.. నీటి సమస్య పరిష్కరించి ఉంటే..ఈ ఘటన జరిగి ఉండేది కాదని మహిళలు మండిపడుతున్నారు. కాగా ఎంపీడీఓ బాసూరి శంకరరావు, సిబ్బంది అన్నపూర్ణమ్మ మృతిపై తీవ్ర విచారం వ్యక్తం వ్యక్తం చేశారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top